Share News

Indian Rupee: డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్టానికి రూపాయి.. ఎందుకంటే..

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:58 AM

కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం భయాలను రేకెత్తించాయి. దీంతో సోమవారం (ఫిబ్రవరి 3, 2025) భారత రూపాయి విలువ 67 పైసలు తగ్గి US డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 87.29కి చేరుకుంది.

Indian Rupee: డాలర్‌తో పోలిస్తే ఆల్ టైం కనిష్టానికి రూపాయి.. ఎందుకంటే..
Indian Rupee Hits Record Low

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) ఇటివల పలు దేశాలపై సుంకాల విధింపు నిర్ణయాల కారణంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో 2025 ఫిబ్రవరి 3న భారత రూపాయి (Indian Rupee) డాలర్‌తో (US dollar) పోలిస్తే 87.29కి పతనమైంది. ఈ క్రమంలో అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. ట్రంప్‌ అధిక సుంకాల విధింపులు, అమెరికా డాలర్‌కు ఉన్న అధిక డిమాండ్ వల్ల ఇది జరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


ట్రంప్ బెదిరింపులు..

ట్రంప్ సుంకాల బెదిరింపులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీలను ప్రభావితం చేశాయి. దీంతో డాలర్‌కు పెరిగిన డిమాండ్ కారణంగా రూపాయి మరింత పతనమైంది. ముఖ్యంగా చమురు దిగుమతులు, డాలర్ క్రయవిక్రయాల నేపథ్యంలో అమెరికా డాలర్ సూచిక (Dollar Index) వృద్ధి చెందడం వల్ల భారత రూపాయి మరింత బలహీనంగా మారింది. రూపాయి విలువ 87.29 వద్ద ప్రారంభమైంది. ఇది శుక్రవారం ముగింపుతో పోలిస్తే 67 పైసలు తగ్గింది. ఇక డాలర్ విషయానికి వస్తే ఇండెక్స్ 109.77 వద్ద ట్రేడవుతోంది, ఇది గతంతో పోలిస్తే 1.30 శాతం పెరిగింది.


ఇతర దేశాల కరెన్సీలు కూడా..

ఈ పరిణామాలు యూరో, GBP, యెన్, ఇతర ఆసియా కరెన్సీలపై కూడా ప్రభావం చూపించాయి. యూరో 1.0224, GBP 1.2261, జపాన్ యెన్ 155.54కి పడిపోయాయి. ఈ సమయంలో బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు 0.71 శాతం పెరిగి USD 76.21కి చేరుకున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్‌లో మరిన్ని మార్పులను సూచిస్తుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధించి, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతను సృష్టించారని నిపుణులు చెబుతున్నారు.


ఈ సుంకాల విషయంలో..

ఇప్పటికే కెనడా, మెక్సికో తమపై విధించిన సుంకాలకు ప్రతీకారంగా సమాధానమిచ్చే ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితిని పెంచి, భారత రూపాయిపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గుతారా లేదా ఇలాగే కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. ఇలాగే కొనసాగితే ప్రపంచ మార్కెట్లకు ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 03 , 2025 | 11:59 AM