Share News

Crude Oil: భారత్ ఎన్ని దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందంటే..

ABN , Publish Date - Feb 10 , 2025 | 09:49 PM

మీకు భారత్ ఎన్ని దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందో తెలుసా. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఈ అంశంపై కేంద్ర మంత్రి కీలక విషయాలను వెల్లడించారు.

Crude Oil: భారత్ ఎన్ని దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందంటే..
India Imports Crude Oil

భారతదేశం (India) పెరిగిన ముడి చమురు (Crude Oil) డిమాండ్‌ను తీర్చడానికి అన్ని వనరుల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ పూరి సోమవారం ప్రకటించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2025కి ఒక రోజు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో పెట్రోలియం మంత్రి భారతదేశం ముడి చమురు దిగుమతులను 27 దేశాల నుంచి 40 దేశాలకు విస్తరించిందని తెలిపారు. అలాగే అర్జెంటీనా ఈ లిస్టులో కొత్త సరఫరాదారు దేశంగా చేరిందన్నారు.


ప్రధానంగా ఈ దేశాల నుంచి..

డిమాండ్‌కు సంబంధించి ముడి చమురు సరఫరా దేశాల నుంచి దిగుమతుల ధరల ఆధారంగా లేదా కొన్నిసార్లు భౌగోళిక సమీపానికి అనుగుణంగా మారవచ్చన్నారు. భారత్‌కు ప్రధాన సరఫరాదారులుగా అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్ ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న అన్ని వనరుల నుంచి ముడి చమురు దిగుమతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.


80 శాతానికి పైగా దిగుమతులు..

భారతదేశం ఇప్పటివరకు ముడి చమురు అవసరాలను 80 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడి తీర్చుకుంటుంది. ఈ క్రమంలో దేశీయంగా ముడి చమురు ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. భారతదేశం శుద్ధి చేసిన ముడి చమురు డిమాండ్‌ను తగ్గించడానికి అలాగే పునరుత్పాదక, ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తోంది. ఇలా చేయడం ద్వారా సహజ వాయువు వాడకం పెరగనుంది.


ప్రత్యామ్నాయ ఇంధనాలు

దీంతోపాటు ఇథనాల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG), బయోడీజిల్ వంటి పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని కూడా క్రమంగా పెంచుతున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా సహజ వాయువును ఇంధనంగా ఉపయోగించడం కోసం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో సహజ వాయువు వాడకం పెరగడం ద్వారా భారతదేశం శుద్ధి చేసిన ముడి చమురు డిమాండ్‌ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.


ముడి చమురు డిమాండ్

S &P గ్లోబల్ కమోడిటీ ఇన్‌సైట్స్ ప్రకారం 2026 నాటికి భారతదేశం శుద్ధి చేసిన ముడి చమురు డిమాండ్ రోజుకు 5.7 మిలియన్ బ్యారెల్స్ (b/d)కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ, ఇది కీలకంగా మారింది. దేశంలో పెరుగుతున్న శుద్ధి చేసిన ముడి చమురు డిమాండ్, అనేక ఇతర ఆర్థిక వ్యవస్థలకు తోడ్పడుతోంది. ఇది దేశానికి అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో మరింత ఆధారపడటం, కొత్త సరఫరాదారులతో సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదం చేయనుంది.


ఇవి కూడా చదవండి:

EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

Stock Market: 1138 పాయింట్లు పడిపోయిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల ఆందోళన..


Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 09:50 PM