Share News

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేడు ఎంతంటే..

ABN , Publish Date - Dec 03 , 2025 | 08:23 AM

పసిడి ప్రియులకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా నాలుగు రోజులు పాటు పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. నేటి గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..

 Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేడు ఎంతంటే..
Gold price today India

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి బంగారం(Gold) అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా మహిళలు పసిడి ఆభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఎప్పుడూ బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, డాలర్ విలువ వంటి కీలక అంశాలు బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగేలా చేశాయి.


బంగారంలో పెట్టుబడులు సైతం భారీగా పెరగడం ధరలు పెరిగేందుకు కారణమైంది. ఇక బంగారం ధరలు తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. గత నాలుగు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర నేడు(డిసెంబర్ 3) ఎట్టకేలకు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, నేడు ఉదయం (డిసెంబర్ 2) 6.30 గంటల సమయంలో భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,860 కు చేరుకుంది. నిన్నటి ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ. 1,19,040 చేరుకుంది. కిలో వెండి రూ.1,95,900 (Gold, Silver Rates on Dec 3).


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు(బుధవారం) ఎట్టకేలకు తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 33 డాలర్లకు పైగా పడిపోయింది. దీంతో ఔన్సు బంగారం ధర 4207 డాలర్ల వద్దకు దిగి వచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.54 శాతం మేర తగ్గి 58.25 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో మూడు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1,29,860 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం రేటు 10 గ్రాములకు రూ.550 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,19,040 వద్దకు దిగివచ్చింది.


బంగారం ధరలు ఇవీ (24కే, 22కే, 18కే)

అహ్మదాబాద్: ₹1,29,910, ₹1,19,090, ₹97,450

న్యూఢిల్లీ: ₹1,30,010, ₹1,19,190, ₹97,550

ముంబై: ₹1,29,860,₹1,19,040, ₹97,400

బెంగళూరు ₹1,29,860,₹1,19,040,₹97,400

విజయవాడ: ₹1,29,860, ₹1,19,040, ₹97,400

హైదరాబాద్: ₹1,29,860, ₹1,19,040, ₹97,400

చెన్నై: ₹1,31,340; ₹₹1,20,390; ₹1,00,390

కోల్‌కతా: ₹1,29,860; ₹1,19,040; ₹97,400

కేరళ: ₹1,29,860; ₹1,19,040; ₹97,400

పుణె: ₹1,29,860; ₹1,19,040; ₹97,400


కిలో వెండి ధర

చెన్నై: ₹1,95,100

ముంబై: ₹1,88,100

న్యూఢిల్లీ: ₹1,88,100

కోల్‌కతా: ₹1,88,100

బెంగళూరు: ₹1,88,100

హైదరాబాద్: ₹1,95,100

విజయవాడ: ₹1,95,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Updated Date - Dec 03 , 2025 | 08:44 AM