CM Reventh reddy: బీజేపీకి తెలంగాణ రుచి చూపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Dec 03 , 2025 | 08:08 AM
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11. 00 గంటలకు పార్లమెంట్లో ప్రధానితో ఆయన భేటీ అవనున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 03: కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయకుంటే పోరాటం తప్పదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అంటే ఏమిటో బీజేపీకి రుచి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని నిధులు అడగడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
నిధులు ఇవ్వకుంటే.. రాష్ట్రంలో బీజేపీని ప్రజలు నేలమట్టం చేస్తారంటూ ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వాలంటూ ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుధవారం న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్లో ప్రధానితో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు, పథకాలతోపాటు ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు.
ఖర్గేతో భేటీ..
అలాగే డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ ప్రారంభానికి రావాలంటూ ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతోపాటు మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సమావేశమయ్యారు.
రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చ..
ఈ సమ్మిట్‌కు హాజరుకావాలంటూ ఖర్గేను ఆహ్వానించారు. అదే విధంగా తెలంగాణలోని రాజకీయ తాజా పరిస్థితులపై సైతం ఈ సందర్భంగా ఖర్గేకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్క్రబ్ టైఫస్పై అవగాహన కల్పించండి
తెలంగాణలో రాత్రివేళా సంపద సృష్టి.. రేవంత్ సర్కారు వ్యూహరచన
For More TG News And Telugu News