Gold Silver Rates Today: గుడ్ న్యూస్.. మళ్లీ లక్ష రూపాయల దిగువకు వచ్చిన పసిడి
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:40 AM
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ లక్ష రూపాయల నుంచి దిగువకు వచ్చాయి. పెట్టుబడి అవకాశాలతోపాటు గోల్డ్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నేటి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

బంగారం, వెండి ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పసిడి ధరలు మళ్లీ లక్షలోపునకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జులై 27, 2025న ఉదయం 6:20 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.540 తగ్గి రూ.99,930కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,600కు చేరింది. అలాగే వెండి ధరలు కూడా కిలోకు రూ.1900 తగ్గుముఖం పట్టాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములకు) రూ.99,930, 22 క్యారెట్ల గోల్డ్ రూ.91,600, వెండి (కిలోకు) రూ.1,26,000.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,080, 22 క్యారెట్ల బంగారం రూ.91,750, వెండి రూ.1,16,000.
ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ.99,930, 22 క్యారెట్ల బంగారం రూ.91,600, వెండి రూ.1,16,000.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ.99,930, 22 క్యారెట్ల బంగారం రూ.91,600, వెండి రూ.1,26,000.
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ.99,930, 22 క్యారెట్ల బంగారం రూ.91,600, వెండి రూ.1,16,000.
ఈ ధరలు స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి నగరాల మధ్య స్వల్ప వ్యత్యాసాలను చూపిస్తాయి.
ధరల తగ్గుదలకు కారణాలు
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికన్ డాలర్ బలపడటం వల్ల బంగారం ధరలు తగ్గాయి. ఎందుకంటే బంగారం ధరలు సాధారణంగా డాలర్‌తో విలోమానుపాతంలో ఉంటాయి. డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఇతర సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. అధిక వడ్డీ రేట్లు బంగారం వంటి దిగుబడి లేని ఆస్తుల ఆకర్షణను తగ్గిస్తాయి. ఫలితంగా డిమాండ్ తగ్గుతుంది. ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఈ ధోరణికి దోహదపడ్డాయి.
వెండి డిమాండ్ తగ్గుదల
వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వల్ల ప్రభావితమయ్యాయి. వెండి ఎక్కువగా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి గ్లోబల్ ఉత్పాదన క్షీణించడం దీని ధరలు తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి