Kingdom Movie: కింగ్‌డమ్ మూవీకి తిప్పలు.. తిరుపతిలో నిరసన సెగ
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:14 PM
Kingdom Movie: జులై 31వ తేదీన సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు కింగ్ డమ్ టీమ్. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని గిరిజన సంఘాలు స్పష్టం చేశాయి.

తిరుపతి: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కింగ్‌డమ్ సినిమా జులై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి నుంచి వివాదాలతో ముందుకు సాగుతోంది. ‘కంగువ’ సినిమా ఫంక్షన్‌లో గిరిజనులపై విజయ్ చేసిన కామెంట్లు వివాదానికి తెరతీశాయి. ఇప్పటికే ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది. నెలలు గడుస్తున్నా వివాదం మాత్రం ఓ కొలిక్కి రావటం లేదు. గిరిజనులు విజయ్ దేవరకొండపై ఆగ్రహంతో ఉన్నారు.
ట్రైలర్ లాంచ్ అడ్డుకుంటాం..
జులై 31వ తేదీన సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో.. ఈ రోజు(శనివారం) తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే, గిరిజన సంఘాలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశాయి. గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడాన్ని గిరిజన సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. ఇక, గిరిజనుల హెచ్చరికల నేపథ్యంలో.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగే చోట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఇండియన్ ట్రావెలర్స్‌కు అలర్ట్.. ఈ మార్పులు గురించి తప్పక తెలుసుకోండి..
థాయ్‌లాండ్, కంబోడియా మధ్య యుద్ధం.. ఈ ఏరియాలకు అస్సలు వెళ్లకండి..