Share News

Gold and Silver Prices: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:30 AM

ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత మూడు, నాలుగు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన ధరలు ఊహించని విధంగా మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం ఎంతకు చేరాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and Silver Prices: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు
Gold and Silver Prices July 31st 2025

బంగారం, వెండి ధరలు మళ్లీ సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గత మూడు నాలుగు రోజులుగా తగ్గిన ధరలకు బ్రేక్ (Gold and Silver Prices on July 31st 2025) పడింది. ఈ నేపథ్యంలో జూలై 31న ఉదయం 6:10 గంటల సమయంలో, గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు నిన్నటి రేట్లతో పోలిస్తే మళ్లీ పెరిగాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.680 పెరిగి రూ.1,00,490కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.92,110 స్థాయికి చేరింది. వెండి ధర కూడా కిలోగ్రాముకు రూ.1,200 పెరిగి రూ.1,17,100కి చేరుకుంది. ఈ ధరల పెరుగుదల భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా కనిపించింది.


ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు

  • ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,00,640, 22 క్యారెట్ల బంగారం రూ.92,260, వెండి కిలోగ్రాముకు రూ.1,17,100.

  • చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100.

  • ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100.

  • విజయవాడ: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100.

  • విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,17,100.

  • బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,17,100.

  • ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే సమయంలో వీటి ధరల గురించి మళ్లీ తెలుసుకోవడం ఉత్తమం.


ధరల పెరుగుదలకు కారణాలు

బంగారం, వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఈ సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. బంగారం ధరలు సాధారణంగా డాలర్ బలహీనపడినప్పుడు పెరుగుతాయి. బంగారం ఉత్పత్తి స్థిరంగా ఉండటం, కొత్త గనుల అన్వేషణ తగ్గడం వల్ల సరఫరా పరిమితమవుతోంది. ఇది కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది.


భవిష్యత్తులో ఎంతకు చేరుతుంది

నిపుణుల అంచనాల ప్రకారం, 2025 చివరి నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.25 లక్షలకు చేరుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకు 4,500 డాలర్లకు చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. వెండి ధరలు కూడా దీపావళి నాటికి రూ.1,20,000కి చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 06:40 AM