Share News

Gold Rate: ఊహించని రేటుకు చేరిన బంగారం.. ఇలా షాక్ ఇచ్చిందేంటి..

ABN , Publish Date - Jan 18 , 2025 | 08:54 AM

బంగారం ధరలు రోజురోజుకీ షాక్ ఇస్తున్నాయి. గడిచిన ఏడాది ఆఖరి వరకు కాస్త తగ్గుతూ వచ్చిన పసిడి.. ఇప్పుడు కొండెక్కింది. అమాంతం ఊహించని రేటుకు చేరింది గోల్డ్.

Gold Rate: ఊహించని రేటుకు చేరిన బంగారం.. ఇలా షాక్ ఇచ్చిందేంటి..
Gold And Silver Rates

గతేడాది ఆఖరి వరకు బంగారం అందర్నీ ఊరిస్తూ వచ్చింది. గోల్డ్‌తో పాటు సిల్వర్ రేట్స్ తగ్గుతూ వచ్చాయి. అంతకుముందు వరకు పెరుగుతూ ఉన్న ధరలు క్రమేపీ తగ్గుతూ రావడంతో మహిళలతో పాటు గోల్డ్ లవర్స్ కొనేందుకు ఉత్సాహం చూపించారు. అయితే కొత్త ఏడాదిలో మాత్రం పసిడి, వెండి తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాయి. రయ్‌రయ్‌మని పరుగులు తీస్తూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 80 వేల మార్క్‌ను దాటేసి పరుగులు పెడుతోంది గోల్డ్. 2025, జనవరి 18 (శనివారం) ఉదయం చూసుకుంటే.. 22 క్యారెట్ల తులం బంగారం రూ.74,510గా ఉంది.


వెండీ తగ్గేదేలే!

ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.81,280గా ఉంది. వెండి ధరలు కూడా పెరిగాయి. శనివారం పొద్దున కిలో వెండి ధర రూ.96,600గా ఉంది. తులం బంగారం మీద రూ.10 మేర పెరగగా.. అదే సిల్వర్‌పై రూ.100 మేర రేటు పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలను బట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే పైన పేర్కొన్న ధరలు జనవరి 18 ఉదయానికి సంబంధించినవి. ఒక్కోసారి మధ్యాహ్నానికే వాటి రేట్లలో పెరుగుల, తగ్గుదల చోటుచేసుకుంటూ ఉంటాయి. కాబట్టి బంగారం, వెండి క్రయవిక్రయాలకు ముందు సమీప ప్రాంతాల్లో వాటి ధరలు తెలుసుకోవడం చాలా మంచిది.


ఇవీ చదవండి:

రిలయన్స్‌ లాభం 18,540 కోట్లు

ఆటో ఎక్స్‌పోలో 100 కొత్త కార్లు విడుదల

రూపాయల్లో విదేశీ చెల్లింపులకు లైన్‌ క్లియర్‌

మరిన్ని వ్యాపార, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 18 , 2025 | 09:48 AM