Share News

Consumer Rights: ఆన్‌లైన్ షాపింగ్ చేసి మోసపోయారా? తక్షణమే ఈ పని చేయండి..

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:25 PM

నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాలు కదపకుండా ఫోన్‌లో ఉండే ఈ-కామర్స్ యాప్స్ నుంచి నచ్చినవి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. అయితే, ఈ విధానం కస్టమర్లకు సౌలభ్యంతో పాటు కొన్నిసార్లు సమస్యలనూ తీసుకొస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసపోతే వెంటనే ఈ పని చేయండి.

Consumer Rights: ఆన్‌లైన్ షాపింగ్ చేసి మోసపోయారా? తక్షణమే ఈ పని చేయండి..
How to Use E-Daakhil

How to Prevent e-commerce Sites Fraud: ఈ-కామర్స్ సైట్స్ ప్రవేశించినప్పటి నుంచి షాపింగ్ తీరుతెన్నులే మారిపోయాయి. బయటకు వెళ్లాల్సిన పని లేకుండా బట్టలు, టీవీలు, ఇంటీరియర్స్, మెడిసిన్స్, ఇలా అదీ ఇదీ అని లేకుండా ప్రజలు సమస్తం ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. మన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా కొన్ని క్షణాల్లోనే ఆర్డర్ చేసేస్తున్నారు. అయితే, ఆన్‌లైన్ షాపింగ్ కస్టమర్లకు కొన్నిసార్లు అనుకోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొన్ని కంపెనీలు నకిలీ ఉత్పత్తులు డెలివరీ చేసే అవకాశముంది. అలాంటి సందర్భాల్లో కస్టమర్ చేసే కాల్స్ లేదా ఈ మెయిల్స్‌కు కంపెనీల నుంచి రిప్లై రాదు. కొన్నిసార్లు కంపెనీలు సమస్యను పరిష్కరించడానికి బదులుగా విక్రేతలు లేదా తయారీదారులను నిందిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటర్న్ లేదా రిఫండ్ చేయడం అసాధ్యమవుతుంది. అందుకే కస్టమర్లు తమ డబ్బును తిరిగిపొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఆన్‌లైన్ షాపింగ్ సులభంగా, సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు తప్పుడు లేదా నకిలీ ఉత్పత్తులను డెలివరీ చేసినప్పుడు సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి సందర్భాల్లో కంపెనీలు రిటర్న్‌లు లేదా రీఫండ్‌లలో సహాయం చేయకపోతే అంతేసంగతులు. ఇంకొన్నిసార్లు కస్టమర్ సర్వీస్ వాళ్లు కాల్స్‌కు లేదా ఇమెయిల్‌లకు సమాధనం ఇవ్వరు. ఇచ్చినా సమస్యను పరిష్కరించడానికి బదులుగా విక్రేతలు లేదా తయారీదారులను నిందిస్తారు. అందుకే వినియోగదారులు తమ హక్కులను తాము రక్షించుకోవడానికి, తమ డబ్బును తిరిగి పొందడానికి ఏమి చేయాలో కచ్చితంగా తెలుసుకోవాలి.


ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఉత్పత్తి నాణ్యత లేకుండా ఉన్నా లేదంటే తప్పుడు ప్రొడక్ట్ డెలివరీ చేసినా కస్టమర్ ఏం చేయాలి?

అటువంటి పరిస్థితిలో, కస్టమర్ ముందుగా డెలివరీ అయిన ప్రొడక్ట్ ఫోటోలు, వీడియోలను రికార్డు చేసి పెట్టుకోవాలి. తరువాత షాపింగ్ యాప్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లి రిటర్న్-రీప్లేస్‌మెంట్ రిక్వెస్ట్ పెట్టుకోండి. చాలా కంపెనీలు 7 నుంచి 10 రోజుల రిటర్న్ పాలసీని కలిగి ఉంటాయి.

కారణం చెప్పకుండానే వస్తువులను తిరిగి ఇచ్చే హక్కు కస్టమర్‌కు ఉందా?

ఇది పూర్తిగా ఆ ఇ-కామర్స్ వెబ్‌సైట్ రిటర్న్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వెబ్‌సైట్‌లు 'నో-క్వశ్చన్ రిటర్న్' వెసులుబాటు ఇస్తాయి. ఇక్కడ కస్టమర్‌లు నిర్దిష్ట సమయంలో (సాధారణంగా 7 లేదా 10 రోజులు) కారణం చెప్పకుండా వస్తువులను రిటర్న్ చేయవచ్చు. అయితే, లోదుస్తులు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు లేదా ఇతర ఆర్డర్‌లుఈ లిస్ట్ లో చేర్చరు. అందుకే, కొనుగోలు చేసే ముందు వెబ్‌సైట్ రిటర్న్, రీఫండ్ పాలసీని జాగ్రత్తగా చదవడం ముఖ్యం.


ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ మోసం, తప్పుడు ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు ఆస్కారం ఉంది. కొన్నిసార్లు ఆఫర్లు లేదా భారీ తగ్గింపుల కారణంగా ప్రజలు మోసాలకు గురవుతారు. అలాంటి సందర్భాలలో కొన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చు.

కంపెనీ రీఫండ్ ఇవ్వడానికి ఇవ్వకున్నా లేదా పదే పదే ఆలస్యం చేసినా ఏం చేయాలి?

కస్టమర్ ముందుగా ఆర్డర్ రసీదు, కస్టమర్ కేర్ కాల్స్ లేదా చాట్‌ల స్క్రీన్‌షాట్‌లు, ఇ-మెయిల్ ప్రూఫ్‌లు మొదలైన వాటితో సహా వారి అన్ని రికార్డులను సురక్షితంగా ఉంచుకోవాలి. కంపెనీ పదే పదే రీఫండ్‌ను ఆలస్యం చేస్తుంటే లేదా స్పందించకపోతే ఇలా చేయండి.


కస్టమర్ కేర్ కాల్స్ లేదా ఇమెయిల్‌లకు కంపెనీ స్పందించకపోతే ఏం చేయాలి?

అటువంటి పరిస్థితిలో, కస్టమర్ ముందుగా కంపెనీకి లిఖితపూర్వక నోటీసు పంపాలి. నోటీసులో పూర్తి సమస్య, వాపసు డిమాండ్ స్పష్టంగా పేర్కొనాలి. దీని తర్వాత మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915 కు కాల్ చేయవచ్చు లేదా www.consumerhelpline.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. కావలిస్తే, సోషల్ మీడియాలో కంపెనీని ట్యాగ్ చేయడం ద్వారా ఫిర్యాదును లేవనెత్తి కంపెనీపై ఒత్తిడిని తీసుకురావచ్చు.

ఇ-దాఖిల్ పోర్టల్‌లో ఫిర్యాదు ఎలా దాఖలు చేయాలి?

వినియోగదారులు ముందుగా e-Daakhil.nic.in లో నమోదు చేసుకోవాలి. లాగిన్ అయి 'File New Complaint' పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలను పూరించి సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి. రుసుము (వర్తిస్తే) ఆన్‌లైన్‌లో చెల్లించిన తర్వాత ఫిర్యాదును సమర్పించండి. కంప్లైంట్ స్టేటస్ పోర్టల్‌లో ట్రాక్ చేయవచ్చు.


ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కస్టమర్లకు ఒకే హక్కులు ఉంటాయా?

అవును, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ రెండింటిలోనూ వినియోగదారులకు ఒకే చట్టపరమైన హక్కులు ఉన్నాయి. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 స్పష్టంగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను కూడా కలిగి ఉంది. కంపెనీలు పారదర్శకత, నాణ్యత, సురక్షిత లావాదేవీలు, రిటర్న్ విధానాలకు సంబంధించిన నియమాలను పాటించాలి.

కస్టమర్లకు బాధ్యతలూ ఉంటాయా?

హక్కుల మాదిరిగానే బాధ్యతాయుతమైన వినియోగదారుడిగా ఉండటంలో కూడా కొన్ని విధులు అర్థం చేసుకోవాలి. నెరవేర్చాలి. ప్రతి కస్టమర్ వీటిపై అవగాహన అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో పారదర్శకత, నిజాయితీని కొనసాగించవచ్చు.


  • కొనుగోలు చేసే ముందు ఎల్లప్పుడూ ఉత్పత్తి సమాచారాన్ని (రేటింగ్‌లు, సమీక్షలు, నాణ్యత) తనిఖీ చేయండి.

  • రిటర్న్, వారంటీ నిబంధనలను జాగ్రత్తగా చదవండి.

  • ఎల్లప్పుడూ బిల్లు/ఇన్‌వాయిస్‌ను సేకరించి సురక్షితంగా ఉంచండి.

  • మీకు నకిలీ లేదా నాణ్యత లేని వస్తువులు అందితే ఫిర్యాదు చేయడానికి వెనుకాడకండి.

  • బాధ్యతాయుతంగా షాపింగ్ చేయండి. అనవసరమైన ఆర్డర్లు లేదా రిటర్న్‌లను నివారించండి.

  • ఇతర వినియోగదారులలో అవగాహన పెంచండి.

  • ఈ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా మీరు మిమ్మల్ని మాత్రమే కాకుండా ఇతరులూ మోసాల నుంచి రక్షించడంలో సహాయపడగలరు.


ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 06:36 PM