Share News

OpenAI: ఓపెన్ ఏఐపై కాపీరైట్ దావా.. పరిరక్షణ కోసం ప్రయత్నాలు

ABN , Publish Date - Jan 29 , 2025 | 12:40 PM

ప్రముఖ టెక్ సంస్థ OpenAI ఇబ్బందుల్లో పడింది. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి ఈ సంస్థ కంటెంట్ తీసుకుంటుందని ప్రముఖ భారతీయ మీడియా సంస్థలు ఈ కంపెనీపై వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

 OpenAI: ఓపెన్ ఏఐపై కాపీరైట్ దావా.. పరిరక్షణ కోసం ప్రయత్నాలు
OpenAI

ప్రపంచవ్యాప్తంగా AI టెక్నాలజీపై ఫుల్ క్రేజ్ కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా భారతదేశంలో OpenAI తీవ్ర వివాదంలో చిక్కుకుంది. కీలక మీడియా సంస్థలు, వార్తా సంస్థలు, పుస్తక ప్రచురణకర్తలు తమ కాపీరైట్ హక్కుల పరిరక్షణ కోసం OpenAI పై కాపీరైట్ వ్యాఖ్యాలను దాఖలు చేశాయి. ఈ సమయంలో భారతదేశంలో OpenAI పై న్యాయపరమైన పోరాటం కొనసాగుతోంది. OpenAI 2023లో ఇప్పటికే కొంతమంది సంగీతకారులు, కళాకారులు, వార్తా సంస్థలు పుస్తక ప్రచురణకర్తల నుంచి వ్యాజ్యాలను ఎదుర్కొంటుంది.


కంటెంట్ స్వాధీనం

ఈ కేసులు కాపీ చేసిన కంటెంట్ అనుమతులేకుండా AI తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ వివాదం దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పెద్ద వ్యాపారాలు, సృజనాత్మక వ్యక్తులు, మీడియా సంస్థలు తమ హక్కులను కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి. ఈ విషయంపై తాజాగా భారత్‌లోని ప్రముఖ బిలియనీర్లైన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని మీడియా కంపెనీలు కూడా చేరాయి. ఈ దావాలో OpenAI ఆన్‌లైన్‌లో కంటెంట్ స్క్రాపింగ్ చేస్తుందని చెబుతున్నారు. ఆ కంటెంట్ స్వాధీనం చేసుకోవడాన్ని నిరోధించాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి.


అంగీకారం లేకుండా

గత సంవత్సరం భారతీయ వార్తా సంస్థ ANI చేసిన వాదన ప్రకారం AI టెక్ కంపెనీలు చాలా వరకూ తమ ప్రచురణకర్తలతో అంగీకారం లేకుండా కంటెంట్‌ను చోరీ చేస్తున్నాయని తెలిపింది. దీని వల్ల టెక్ కంపెనీలకు భారీ ఆదాయం వస్తుందని వారు వెల్లడించారు. కానీ తమకు నష్టం వస్తున్నట్లు చెప్పారు. మరోవైపు OpenAI తన వాదనలో "మేము కేవలం బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగిస్తాము" అని చెబుతోంది.

అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ (FIP), పుస్తక ప్రకురణకర్తల పెద్ద సంస్థ, ఈ వాదనను తిరస్కరించింది. వారి ప్రకటనలో "AI టెక్ కంపెనీలు, అనధికారికంగా ఆన్‌లైన్ లో ఉన్న కాపీలు, పుస్తకాల సారాంశాలు, విశ్లేషణలను సృష్టించి వాటిని వ్యాపారం చేయడంతో మా పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. FIPకి చెందిన ప్రముఖ సంస్థలు, బ్లూమ్స్‌బరీ, పెంగ్విన్ రాండమ్ హౌస్, ఇంకా ఇతర పుస్తక ప్రచురణ సంస్థలు ఈ వాదనను సమర్థించాయి.


ఈ కేసులో

OpenAI న్యాయవాది అమిత్ సిబల్ ఈ కేసులో పలు అంశాలను వెల్లడించారు. "మేము అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని సమాధానం ఇవ్వాలని భావిస్తున్నాము" అని ఆయన కోర్టులో తెలిపారు. ఈ కేసు శుక్రవారానికి న్యాయవాదుల సమక్షంలో విచారణకు రాబోతోంది. భారతదేశం OpenAI రెండో పెద్ద మార్కెట్ కాగా, న్యాయ వ్యవస్థ కాపీరైట్ పరిరక్షణకు కీలకమైన పద్ధతులను అభివృద్ధి చేస్తోంది. అయితే టెక్ కంపెనీల పరిధిని నిర్వచించే విధానం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు అనుకూలంగా మారుతూ వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి. ఈ పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వ్యాపారాలు, సృజనాత్మక వ్యక్తులు సహా అనేక కంపెనీలు తమ హక్కుల పరిరక్షణ కోసం తమ తమ స్థానాల్లో పోరాటం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 12:42 PM