Share News

Anil Ambani: అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:32 PM

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు జరుపుతోంది. 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ తాజాగా..

Anil Ambani: అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు
Anil Ambani Reliance

ఇంటర్నెట్ డెస్క్: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు జరుపుతోంది. వీటికి సంబంధించి 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల తర్వాత ఈడీ దాడులు జరుగుతుండటం విశేషం.

ED ప్రాథమిక దర్యాప్తులో 'బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ఇతర ప్రభుత్వ సంస్థలను మోసం చేయడం ద్వారా ప్రజా ధనాన్ని స్వాహా చేయడానికి ప్రణాళికాబద్ధమైన కుట్ర చేసినట్టు తేలింది. అంతేకాదు, అన్ సెక్కూర్డ్ లోన్స్ ప్రక్రియను సులభతరం చేయడానికి యెస్ బ్యాంక్ లిమిటెడ్ మాజీ ప్రమోటర్లతో సహా సీనియర్ బ్యాంక్ అధికారులకు లంచాలిచ్చినట్టు కూడా ఆరోపణలున్నాయి.

2017 - 2019 మధ్య, యస్ బ్యాంక్, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కింద ఉన్న RAAGA కంపెనీలకు సుమారు రూ. 3,000 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. రుణాలు మంజూరు చేయడానికి ముందు, యస్ బ్యాంక్ ప్రమోటర్లు క్విడ్ ప్రోకో విధానంలో లబ్ధిపొందారని ఆరోపణలున్నాయి.

కాగా, ఈడీ దర్యాప్తులో అనేక కీలక విషయాలు గుర్తించినట్టు తెలుస్తోంది. లోన్స్ డాక్యుమెంటేషన్ ప్రక్రియలో అనేక లోపాలు కనిపించినట్టు సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక నియంత్రణ, ఇంకా ఆర్థిక సంస్థల నుంచి ఈడీ కావల్సిన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.


ఇందులో.. గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL)లో జరిగిన తీవ్రమైన అవకతవకలను ఎత్తిచూపి SEBI ఒక నివేదికను సమర్పించింది. నివేదిక ప్రకారం, సంస్థ యొక్క కార్పొరేట్ రుణ పోర్ట్‌ఫోలియో 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,742 కోట్ల నుండి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,670 కోట్లకు దాదాపు రెట్టింపు అయింది.

ఇక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) ఇంకా, అంబానీ అకౌంట్లను చీటింగ్(మోసం) ఖాతాలుగా వర్గీకరించింది. బ్యాంక్.. ఈ ఖాతాను మోసపూరిత ఖాతాగా ముద్ర వేయడం ఇదే మొదటిసారి కాదు. SBI గతంలో నవంబర్ 2020లో RCom ఇంకా, అంబానీ అకౌంట్లను మోసం ఖాతాలుగా ప్రకటించింది. అంతేకాదు, జనవరి 5, 2021న CBIకి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు జనవరి 6న స్టేటస్ కో ఆర్డర్ జారీ చేయడంతో ఫిర్యాదు ఉపసంహరించుకుంది. ఈడీ సోదాల నేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్లో రిలయెన్స్ పవర్ షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్థానిక ఎన్నికలపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 04:36 PM