Hidden Charges : షోరూంలో కార్ లేదా బైక్ కొంటున్నారా.. ఈ ఛార్జీలు ఎప్పుడూ చెల్లించకండి..
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:31 PM
Beware of Hidden Charges : కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాల్లో షోరూం వాళ్లు మీకు అదనపు ఛార్జీలు వేసే అవకాశం ఉంది. ఈ ఏడింటిటిపై మీతోనే ఛార్జీలు వసూలు చేస్తారు. అందుకే మీరు వీటి కోసం ఎప్పుడూ డబ్బు చెల్లించకండి. షోరూమ్‌లో హిడెన్ ఛార్జీల మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోండి.

Beware of Hidden Charges : మీరు షోరూంకు వెళ్లి కారు లేదా బైక్ కొనుగోలు చేసినప్పుడు డీలర్ బిల్లులో అనేక వస్తువులకు అదనపు ఛార్జీలు జోడించే అవకాశం ఉంది. డీలర్లు మీకు తెలియకుండానే బిల్లులో చేర్చే అనేక ఛార్జీల వివరాలు ఇక్కడ ఉన్నాయి. కస్టమర్ల నుంచి షోరూం వాళ్లు వేటిపైన హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తారో చాలా మందికి తెలియదు. అందుకే, మీరు చెల్లించాల్సిన అవసరం లేని ఛార్జీల గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాహనం కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లపై డీలర్ వేసే అదనపు ఛార్జీల లిస్ట్ మీకోసం..
నిర్వహణ లేదా లాజిస్టిక్స్ ఛార్జీలు..
వాహనం నిర్వహణ, రవాణా లేదా లాజిస్టిక్స్ కోసం ఖర్చు చేసే డబ్బును కవర్ చేయడానికి చాలా మంది డీలర్లు అదనపు రుసుములను వసూలు చేస్తారు. వాస్తవానికి ఈ రుసుము వాహనం ధరలో చేర్చబడి ఉంటుంది. మళ్లీ మీరు దాని కోసం విడిగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రకమైన ఛార్జీని డీలర్ హ్యాండ్లింగ్ ఛార్జ్ అని కూడా పిలుస్తారు. ఇది చట్టవిరుద్ధమైన చెల్లింపు.
RTO ఏజెంట్ ఫీజులు..
వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ (RTO) కోసం డీలర్ ఏజెంట్లు ఫీజులు లేదా సేవా ఛార్జీల రూపంలో అదనపు డబ్బును వసూలు చేస్తారు. అయితే, RTO రుసుములను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మీరు RTO వద్దకు వెళ్లి కూడా చెల్లించవచ్చు. డీలర్ ఎక్కువ వసూలు చేస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఉపకరణాల రుసుము..
చాలా మంది డీలర్లు వాహనంతో వచ్చే సీట్ కవర్లు, మ్యాట్స్ లేదా మడ్ ఫ్లాప్స్ వంటి ఉపకరణాలకు డబ్బు వసూలు చేస్తారు. అవి తప్పనిసరి అని చెబుతారు. ఇది పూర్తిగా ఆప్షనల్. మీ ఎంపిక, బడ్జెట్ ప్రకారం మీరు బయటి నుండి వీటిని మీరు కొనుగోలు చేయవచ్చు. దీనికి అదనపు డబ్బు చెల్లించాల్సిన పనిలేదు.
వడ్డీరేట్లలో మోసాలు..
ఫైనాన్స్ ద్వారా వాహనాలను కొనుగోలు చేసే వారికి డీలర్లు.. ఫైనాన్స్ కంపెనీల సహకారంతో వడ్డీ రేట్లపై అదనపు ఛార్జీలను జోడిస్తారు. మీరు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీని నేరుగా సంప్రదించి ఛార్జీల గురించి పూర్తి సమాచారం పొందడం మంచిది. కనీసం రెండు నుండి మూడు బ్యాంకుల ఫైనాన్స్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ప్రయోజనం అనిపించే బ్యాంకు నుండి రుణం తీసుకోండి. మీకు అవకాశం ఉంటే డీలర్ ద్వారా ఫైనాన్సింగ్ చేయడాన్ని నివారించండి.
బీమాపై అధిక ఛార్జీ..
డీలర్ అందించే బీమా పాలసీ ఛార్జీలు తరచుగా మార్కెట్ కంటే ఎక్కువగా ఉంటాయి. మీరు వివిధ బీమా కంపెనీల రేట్లను మీరే పోల్చి చూసి మంచిది, సరసమైన ధరకే వచ్చే పాలసీని ఎంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు బీమా పాలసీ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు.
ప్రీ-డెలివరీ తనిఖీ (PDI) ఛార్జీలు..
ప్రీ-డెలివరీ తనిఖీ (PDI) అనేది వాహన నాణ్యతను తనిఖీ చేసే ప్రక్రియ. ఇది డీలర్ బాధ్యత. దీని కోసం డీలర్‌కు ఎటువంటి ప్రత్యేక ఛార్జీ చెల్లించకూడదు. కొంతమంది డీలర్లు ఈ ప్రక్రియ కోసం డబ్బు కూడా అడుగుతారు. ఇది తప్పు.
ఫాస్ట్‌ట్యాగ్‌పై అదనపు ఛార్జీలు..
ఫాస్టాగ్ రుసుమును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చాలా మంది డీలర్లు దీనిని జారీ చేయడం పేరుతో ఎక్కువ డబ్బు వసూలు చేస్తారు. ఇది తప్పు. ఫాస్టాగ్ కోసం మీరు నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ చెల్లించకూడదు.
Read Also : షాకింగ్.. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధరలు..
కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..
అమౌంట్ స్థానంలో అకౌంట్ నంబర్.. కస్టమర్ ఖాతాలోకి రూ. 52,314 కోట్లు