Share News

YS Jagan: జగన్ భయంకర కుట్రలకు తెరలేపుతున్నాడు: మంత్రి పయ్యావుల

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:36 PM

అమరావతి, జులై 8: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో భయంకర కుట్రలకు తెరలేపుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక..

YS Jagan: జగన్ భయంకర కుట్రలకు తెరలేపుతున్నాడు: మంత్రి పయ్యావుల
Payyavula Keshav

అమరావతి, జులై 8: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయంకర కుట్రలకు తెరలేపుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీయాలని జగన్‌ కుట్ర చేస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. ఓటమి తర్వాత కూడా జగన్‌ వైఖరిలో మార్పు లేదన్న పయ్యావుల.. ఓట్లు వేయలేదని ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏపీలో సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.


ఏపీకి పెట్టుబడులు వస్తుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దని పారిశ్రామికవేత్తలకు.. ఉదయ్‌భాస్కర్‌ అనే వ్యక్తితో 200 మెయిల్స్‌ పెట్టించారని మంత్రి పయ్యావుల చెప్పారు. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డిని తెరపైకి తీసుకొచ్చారని.. జగన్‌ ఎన్ని కుట్రలు పన్నినా ఏపీ బ్రాండ్‌ ఎక్కడా తగ్గలేదని పయ్యావుల అన్నారు. మేం పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నామన్న మంత్రి పయ్యావుల.. 'గత వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు.. జగన్‌ నీ ఏడుపు ఇంకెంతకాలం?' అని మంత్రి పయ్యావుల కేశవ్‌.. వైఎస్ జగన్‌కు ఘాటుగా కౌంటరిచ్చారు.


పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!

రూ.200 మోసం చేశాడు.. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 04:53 PM