Share News

YSRCP: జగన్ నిర్ణయం.. రోజాకు చెక్ పెట్టేందుకేనా..

ABN , Publish Date - Feb 11 , 2025 | 02:11 PM

YSRCP: వైసీపీలో కొత్త ఇష్యూ మొదలైంది.. పార్టీ నుంచి ఓ మాజీ మంత్రిని పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. స్వయంగా పార్టీ అధినేత జగనే ఈ ప్లాన్‌కు సూత్రధారి అని చర్చ నడుస్తోంది. మరి ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు.. వైసీపీలో ఏం జరుగుతోంది.. ప్రత్యేక కథనం మీకోసం..

YSRCP: జగన్ నిర్ణయం.. రోజాకు చెక్ పెట్టేందుకేనా..
YSRCP

అమరావతి, ఫిబ్రవరి 11: వైసీపీలో ఏదో జరుగుతోంది.. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీని వీడగా.. ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ అధినేతే కొందరికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పుడిదే అంశంపై ఏపీ పాలిటిక్స్‌లో.. ముఖ్యంగా వైసీపీలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ జగన్ రెడ్డి పార్టీలో ఏం జరుగుతోంది. ఎవరిని పంపించేందుకు పొగ పెడుతున్నారు. ఎవరి రాక కోసం ఎవరిని బలి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..


ఫ్యాన్ పార్టీలో.. ఓవైపు కొన్ని రెక్కలు తమంతట తాము విడిపోతుంటే.. మరోవైపు.. ఉన్న రెక్కలను సైతం ఊడగొట్టే ప్రయత్నాలను చేస్తున్నారట ఆ పార్టీ అధినేత. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పార్టీ నేతలు.. ఇవేం పనులు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పంక పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీలు భారీ సీట్లతో జయకేతనం ఎగురవేశాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక అప్పటి నుంచి వైసీపీ పతనం స్టార్ట్ అయ్యింది. ఆ పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన పలువురు ముఖ్య నేతలు.. వైసీపీని వీడారు. మరికొందరు వీడే ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, తాజా రాజ్యసభ సభ్యులు సైతం జగన్‌కు గుడ్‌ బై చెప్పి.. తలోదారి చూసుకున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన నాయకుల కొరత ఏర్పడింది. ఇలాంటి క్రమంలో వైసీపీలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సాధారణంగా ఉన్న బలాన్ని కాపాడుకోవడంతో పాటు.. కొత్త బలాన్ని తెచ్చుకోవడం కోసం ఏ పార్టీ అయినా.. ఏ రాజకీయ నాయకుడైనా ప్రయత్నిస్తారు. కానీ, వైసీపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోందట. అందుకే ఈ విసయంలో పెద్ద చర్చనీయాంశమైంది.


ఇంతకాలం నేతలు తమ పొలిటికల్ కెరీర్ కోసం వైసీపీని వీడుతూ వస్తుండగా.. ఇప్పుడు వైసీపీ అధినేతే స్వయంగా కొందరిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారట. మాజీ మంత్రి రోజాను పార్టీ నుంచే సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రోజా సేవలు ఇక చాలని.. బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే.. గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండో కుమారుడిని వైసీపీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు జగన్. యువ నాయకుడు గాలి జగదీష్.. బుధవారం నాడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు.


అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. జగదీష్ చేరికపై రోజాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదట. ఈ విషయంపైనా వైసీపీలో బిగ్ డిస్కషన్ నడుస్తోంది. నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేయాలనే.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరిలో రోజా ఘోరంగా ఓడిపోయింది. రోజా నాయకత్వాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దాని ఫలితమే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి. గ్రామ స్థాయిలో సర్పంచ్‌ల నుంచి.. జడ్పీటీసీల వరకు చాలా మంది వైసీపీ నాయకులు రోజాని వ్యతిరేకించి.. రోజాకు వ్యతిరేకంగా పని చేశారు. ఇప్పటికీ ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత జగన్‌కు రోజాపై అనేక ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలోనే.. ఇక రోజా సేవలకు సెలవు చెప్పాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారట.


వాస్తవానికి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రోజా వైసీపీ కోసం చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ.. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. మరి అలాంటి నాయకురాలిని జగన్ దూరం పెట్టాలని భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. మరి నిజంగానే రోజాను పక్కనపెట్టే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా.. రోజా ప్రాధ్యాన్యతను తగ్గించి జగదీష్‌కు ప్రాధన్యతను కల్పిస్తారా.. ఒకవేళ అదే జరిగితే రోజా భవిష్యత్ ఏంటి అనేది తెలియాలంటే.. జరుగబోయే పరిణామాల కోసం వేచి చూడాల్సిందే.


Also Read:

రోహిత్.. వాళ్లతో జాగ్రత్త: రవిశాస్త్రి

ఎలాన్ మస్క్‌కు సామ్ ఆల్ట్‌మాన్ కౌంటర్.. ఏం జరిగిందంటే..

మహా కుంభమేళా వెళ్తున్నారా.. కొత్త రూల్ తప్పక

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 11 , 2025 | 02:11 PM