Share News

YSRCP Political Committee: వైసీపీలో 33 మందితో రాజకీయ సలహా మండలి

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:18 AM

వైసీపీలో రాజకీయ సలహా మండలిని పునర్వ్యవస్థీకరించిన జగన్‌ 33 మందితో జంబో కమిటీని ఏర్పాటు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్‌గా నియమించారు,

YSRCP Political Committee: వైసీపీలో 33 మందితో రాజకీయ సలహా మండలి

అమరావతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో రాజకీయ సలహా మండలి(పీఏసీ)ని పునర్వ్యవస్థీకరించారు. 33 మందితో జంబో మండలిని ఆ పార్టీ అధినేత జగన్‌ నియమించారు. దీనికి ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా ఉంటారు. మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, కొడాలి నాని, జోగి రమేశ్‌, ఆర్‌కే రోజా, విడదల రజని, వెలంపల్లి శ్రీనివాస్‌, పినిపె విశ్వరూప్‌, నందిగం సురేశ్‌, ఆదిమూలపు సురేశ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాకె శైలజానాథ్‌, తోట త్రిమూర్తులు. కోన రఘుపతి, బొల్లా బ్రహ్మనాయుడు, అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభా్‌షచంద్రబోస్‌, గొల్ల బాబూరావు, కె.నారాయణస్వామి, ఎం.శంకరనారాయణ, విశ్వేశ్వర్‌రెడ్డి, అంజాద్‌బాషా, ఎన్‌ ప్రసన్నకుమార్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 04:18 AM