Turaka Kishore: తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు
ABN , Publish Date - Jan 24 , 2025 | 06:03 PM
Turaka Kishore: వైసీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌కు మాచర్ల కోర్టు మళ్లీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు.

నరసారావుపేట, జనవరి 24: మాచర్లకు చెందిన టీడీపీ నేత కేశవరెడ్డి నివాసంపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత తురకా కిషోర్‌ను పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. అతడితోపాటు అతడి సోదరుడు తురకా శ్రీకాంత్‌ను సైతం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారిద్దరికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఈ సోదరులిద్దరిని కట్టుదిట్టమైన భద్రత నడుమ నెల్లూరు జైలుకు తరలించారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తురకా కిషోర్‌తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్ ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్‌గా తరుకా కిషోర్ వ్యవహరించారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ఆయన చెలరేగిపోయారు. ఇంకా చెప్పాలంటే.. 2022లో మాచర్లలోని టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టిన కేసులో తురకా కిషోర్‌తోపాటు అతడి సోదరుడిపై పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో వారిపై కేసు నమోదు చేశారు.
కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదికాక.. పిన్నెల్లి సోదరుల అండ దండా చూసుకొని తురకా కిషోర్, తురకా శ్రీకాంత్ మరింత రెచ్చిపోయారు. ఇక 2022, డిసెంబర్ 16వ తేదీన మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి.. ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్‌కు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ఈ కార్యక్రమంపై తురక కిషోర్‌తోపాటు అతడి వందలాది మంది అనుచరులు దాడి చేశారు.
Also Read: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్
ఆ క్రమంలో వారిపై హత్యాయత్నానికి ఒడిగట్టారు. అలాగే టీడీపీకి చెందిన పలువురి నేతలు ఇళ్లలో లూఠీకి సైతం పాల్పడ్డారు. అక్కడ నిలిపి ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అదే రోజు రాత్రి.. మాచర్లలోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు కారంపూడి సీఐపై దాడి చేయడంతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో బూత్‌ల వద్ద టీడీపీ ఏజెంట్లపై తురకా కిషోర్ దాడి చేశారు.
Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..
ఇక మాచర్ల పర్యటనకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమాలు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి.. వారిపై హత్యాయత్నానికి తురకా కిశోర్ తెగబడ్డారు. ఈ ఘటనలో కారులోని న్యాయవాది సైతం గాయపడ్డారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తురకా బ్రదర్స్‌పై దాదాపు10 కేసులుపైగా నమోదయ్యాయి.
Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
అయితే గతేడాది మే, జూన్ మాసంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమికి ఓటర్ పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువ తీరింది. ఈ నేపథ్యంలో తురకా కిషోర్ బ్రదర్స్ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. వారి కోసం దాదాపు ఏడు నెలల పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆ క్రమంలో తురకా కిషోర్ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాచర్ల తరలించి.. కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ ముగియడంతో.. మళ్లీ వారిని కోర్టులో హాజరు పరిచారు. దీంతో మళ్లీ వారికి కోర్టు రిమాండ్ విధించింది.
For AndhraPradesh News And Telugu News