YCP: ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకల రచ్చ
ABN , Publish Date - Jun 23 , 2025 | 01:07 PM
YCP: యువత పోరు పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకలు రచ్చ చేశాయి. డీజేలు పెట్టి నృత్యాలు చేశాయి. ఒకానొక దశలో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్ళేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.

West Godavari: ఏలూరు (Eluru) కలెక్టరేట్ (Collectorate) వద్ద వైసీపీ మూకలు రచ్చ రచ్చ చేశాయి. యువత పోరు (Youth Poru ) పేరుతో ఆందోళనకు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపిచ్చింది. అందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకల ఆందోళన శృతిమించింది. వైసీపీ పాటలకు డీజే పెట్టి అల్లరి మూకలు డ్యాన్సులు (DJ dance) వేశాయి. మరోవైపు .. కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీలు, కార్మిక సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో వైసీపీ మూకలు అంగన్‌వాడీ మహిళలతో వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ మూకల తీరుపై ఇతర సంఘాల నేతల అసహనం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ వద్ద పోలీసుల మోహరింపు..
మరోవైపు నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు అట్టర్ ప్లాప్ అయింది. నెల్లూరు పాత జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. పోలీసులను చూసి యువకులు చెల్లాచెదురయ్యారు. నలభై మందితో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.
మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తుండగా.. ఆయన కారు వైసీపీ కార్యకర్త సింగయ్యను తొక్కేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్కడ రప్పా రప్పా నరుకుతామని ప్లకార్డులు పెట్టిన కార్యకర్తను జగన్ వెనకేసుకురావడంపైనా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం నుంచి జనం దృష్టి మళ్లించడానికి ఆయన ఆకస్మికంగా సోమవారం ‘యువత పోరు’కు పిలుపిచ్చారు. నిరుద్యోగ భృతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని వైసీపీ శ్రేణులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారు..: హరీష్‌రావు
వైసీపీ యువత పోరు అట్టర్ ప్లాప్..
సునీల్ కుమార్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు
For More AP News and Telugu News