Share News

AP Police: పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్‌ఐ ఆత్మహత్య.. ఎందుకంటే

ABN , Publish Date - Jan 31 , 2025 | 09:39 AM

Andhrapradesh: తనపై వచ్చిన అవనీతి ఆరోపణలపై మూర్తి తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మూర్తి... తోటి పోలీసులు చూస్తుండగానే తనను తాను రివార్వల్‌తో కాల్చుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్‌ఐను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

AP Police: పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్‌ఐ ఆత్మహత్య.. ఎందుకంటే
SI shoots himself dead T

పశ్చిమగోదావరి, జనవరి 31: జిల్లాలో (West Godavari) ఎస్‌ఐ ఆత్మహత్య కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం తణుకు రూరల్‌ పోలీస్‌ష్టేషన్‌లో (Tanuku Rural Police Station) ఎస్‌ఐ మూర్తి తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్‌కు గురవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏజీఎస్‌ మూర్తి తణుకు రూరల్‌ పోలీస్‌స్టేసన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం మూర్తి వీఆర్‌లో ఉన్నారు. తనపై వచ్చిన అవనీతి ఆరోపణలపై మూర్తి తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మూర్తి... తోటి పోలీసులు చూస్తుండగానే తనను తాను రివార్వల్‌తో కాల్చుకున్నాడు.


వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్‌ఐను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మూర్తి ఆత్మహత్య విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు పోలీసులు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు మూర్తి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా సస్పెండ్‌కు గురవడంతో తీవ్ర మనస్థాపం చెంది మూర్తి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడని కుటుంబసభ్యులు వాపోతున్నారు. అయితే ఎస్‌ఐ ఆత్మహత్య ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి...

శీతాకాల సభల్లో సెగలే!

అమరావతికి ఓఆర్‌ఆర్‌ మణిహారం!

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 09:43 AM