Share News

Crime News: శాయ్ క్రీడా సంస్థ కోచ్‌పై పోక్సో కేసు

ABN , Publish Date - Jun 23 , 2025 | 09:37 AM

Crime News: ఏలూరు శాయ్‌ క్రీడా సంస్థలో కోచ్ లైంగిక వేధింపులు కలకలం రేపింది. వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న బాలికల పట్ల కోచ్ వినాయక ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి. దీంతో ఓ బాలిక స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.

Crime News: శాయ్ క్రీడా  సంస్థ కోచ్‌పై పోక్సో కేసు
Sai Sports Institute

West Godavari: ఏలూరు (Eluru)లోని శాయ్ క్రీడా సంస్థ (Sai Sports Institute)లో లైంగిక వేధింపులు (Harassment) కలకలం రేపింది. క్రీడల్లో చక్కటి తర్ఫీదు ఇచ్చి యువతను బాధ్యతగా తీర్చిదిద్దాల్సిన గురువు స్థానంలో ఉన్న వ్యక్తే అడ్డదారులు తొక్కాడు. క్రీడాకారిణిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శాయ్ హాస్టల్‌లో ఉంటూ శిక్షణ పొందుతున్న బాలికలను కోచ్ వినాయక ప్రసాద్ (Coach Vinayak Prasad) లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాలికలు బెంగళూరులోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారుల బృందం విచారణ చేసింది.


కోచ్‌పై పోక్సో కేసు...

విచారణలో వినాయక ప్రసాద్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏలూరు టూ టౌన్ పోలీసులకు అధికారులు, ఓ క్రీడాకారిణి ఫిర్యాదు చేశారు. ఇంచార్జ్ కోచ్ వినాయక్ ప్రసాద్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సాయ్ హాస్టల్ ఇన్ ఛార్జ్ హోదాలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు. అయితే తనపై కేసు నమోదు కావడంతో వినాయక్ ప్రసాద్‌ అనారోగ్యం సాకుతో విజయవాడలోని ఆసుపత్రిలో చేరాడు.


వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ..

కాగా ఏలూరులో పదోతరగతి చదువుతున్న ఓ బాలిక స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం ప్రాంగణం వద్ద ఉన్న శాయ్‌ కార్యాలయ సముదాయంలోని వసతిగృహంలోనే ఉంటూ రెండున్నరేళ్లుగా వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతోంది. శాయ్‌ ఇన్‌ఛార్జి వినాయక ప్రసాద్‌ కోచ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆయన నెల రోజులుగా తనను వేధిస్తున్నాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆఫీసుకు పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది.


శాయ్‌ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు...

అలాగే వినాయక ప్రసాద్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఇక్కడే శిక్షణ తీసుకుంటున్న మరి కొంతమంది బాలికలు బెంగళూరులోని శాయ్‌ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు నిజమని తేలడంతో వారి సూచనల మేరకు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ చేస్తున్నామని ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా అని ఆరాతీస్తున్నామని సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

సింగయ్య మరణాన్ని కప్పిపుచ్చేందుకు మరో డ్రామా

వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం

తెలంగాణలో రచ్చ రేపుతూన్న ఓ డైలాగ్..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 23 , 2025 | 10:53 AM