DGP Ravada Ajaz: కేరళ డీజీపీగా పశ్చిమగోదారి వాసి
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:22 AM
కేరళ రాష్ట్ర పోలీస్ బాస్‌గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు.

రావాడ ఆజాద్ చంద్రశేఖర్ స్వగ్రామంలో బంధువుల ఆనందోత్సాహాలు
భీమవరం టౌన్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): కేరళ రాష్ట్ర పోలీస్ బాస్‌గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామం వీరవాసరంలో ఆయన బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన 1991 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. కేరళలో పోలీస్ ఉన్నతాధికారిగా పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవల అవార్డును సైతం అందుకున్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను కేరళ ప్రభుత్వం డీజీపీగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ సోమవారం ఉద్యోగ విరమణ చేయడంతో నూతన డీజీపీగా చంద్రశేఖర్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.