AP Chief Secretary : ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఓటు: ఎంకే మీనా
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:05 AM
దేశ పౌరులుగా, ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఓటు అని రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముఖేశ్ కుమార్ మీనా అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన ఉద్యోగులతో ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ పౌరులుగా, ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గత ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతం 80కిపైగా నమోదు చేసి రికార్డు సృష్టించాం. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లను, ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే వారినీ ప్రత్యేకంగా సత్కరించుకుంటున్నాం’ అని మీనా పేర్కొన్నారు.