Share News

Sharmila Criticizes Jagan: జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:12 PM

Sharmila Criticizes Jagan: నిన్న బలప్రదర్శనలో ఇద్దరు చనిపోయారని.. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని వైఎస్ షర్మిల నిలదీశారు. వంద మందికి అనుమతి ఇచ్చినప్పుడు వేల మంది ఎలా వచ్చారన్నారు. పోలీసు శాఖ చూస్తూ ఎందుకు ఉందని అన్నారు.

Sharmila Criticizes Jagan: జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్
Sharmila Criticizes Jagan

విజయనగరం, జూన్ 19: పల్నాడులో బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏంటని.. సమాజం ఎటు పోతుందని అన్నారు. జగన్ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని.. బల ప్రదర్శనలు కాదు అంటూ హితవుపలికారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి..అన్ని అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తున్నారన్నారు.


ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్‌కు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని.. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవని ఏపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. తాము రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్ట్‌లు చేస్తారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారని.. ఆంక్షలు అన్ని కాంగ్రెస్ పార్టీకేనా అని నిలదీశారు. బీజేపీకి ఎదురు నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తున్నందుకు కాంగ్రెస్‌ను అడ్డుకుంటున్నారా అని నిలదీశారు. జగన్ మీద ఎందుకు ఆంక్షలు లేవని అడిగారు. బల ప్రదర్శన మీద ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని.. జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.


నిన్న బలప్రదర్శనలో ఇద్దరు చనిపోయారని.. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని నిలదీశారు. వంద మందికి అనుమతి ఇచ్చినప్పుడు వేల మంది ఎలా వచ్చారన్నారు. పోలీసు శాఖ చూస్తూ ఎందుకు ఉందని అన్నారు. ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. జగన్ రాకముందే ఎందుకు వచ్చే జనాలను ఆపలేదని అడిగారు. బీజేపీ మద్దతుదారులే అని ఆపకుండా ఉన్నారని ఆరోపించారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు కాబట్టి ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాయకుడిగా సమాధానం చెప్పాలన్నారు.


బెట్టింగ్‌లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడం ఏంటని.. దానికి జగన్ వెళ్ళడం ఏంటి అని.. సమాజం ఎటు పోతుందన్నారు. ప్రజా నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని హితవుపలికారు. ‘సూపర్ సిక్స్ ఏమయ్యింది అని అడగాలి. రాజధాని మీద, పోలవరం మీద ఉద్యమాలు చేయాలి. ప్రత్యేక హోదా ఏమయ్యింది అని అడగాలి. అంతేగానీ బల ప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరు ఇచ్చారు. ఈ ఘటన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఓదార్పుకు కాదు.. యుద్ధానికి వెళ్లినట్టుంది.. జగన్‌పై కన్నా సెటైర్

అంబటిపై కేసు.. ఎందుకంటే..

బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే

Read latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 02:19 PM