Nirmala Sitharaman: చరిత్ర ఓ సముద్రం.. చాలా తెలుసుకోవాలి
ABN , Publish Date - Mar 06 , 2025 | 03:11 PM
Nirmala Sitharaman: ప్రపంచ చరిత్ర పుస్తకంలో చరిత్రను క్రోడీకరించి సమగ్రంగా రాశారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పాల్సిన సంస్కృతి మనదని చెప్పుకొచ్చారు.

విశాఖపట్నం, మార్చి 6: చరిత్ర అనేది ఒక సముద్రం అని... తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర, అనే పుస్తక , తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొని ప్రసంగించారు. లీనమై నాని తేలి ఈ పుస్తకాన్ని వెంకటేశ్వరరావు రాశారన్నారు. పుస్తకంలో కొన్ని అంశాలను చదివానని.. ప్రపంచ చరిత్రను క్రోడీకరించి సమగ్రంగా రాశారని తెలిపారు. గతంలో చరిత్ర రాసిన వాళ్ళు దేశానికి న్యాయం జరిగేలా రాయలేదని.. దేశంపై ఆధిపత్యం చలాయించిన వాళ్ళు తమకు అనుకూలంగా చరిత్రను రాసుకునే ప్రయత్నం జరిగిందని అన్నారు. జరిగినవి జరిగినట్టుగా రాయగలిగే ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు.
జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పాల్సిన సంస్కృతి మనదని చెప్పుకొచ్చారు. చరిత్రకారులు వారి ఆలోచనలకు అనుకూలంగా చరిత్రను రాశారు కానీ.. వాస్తవాలు వెలుగులోకి తీసుకురాలేదని తెలిపారు. చరిత్రను వక్రీకరించి రంగు పులిమే కార్యక్రమం పాశ్చాత్య దేశాల్లో కూడా జరిగిందన్నారు. ఓకిజం అనేది అమెరికాలో జరిగిందని.. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఓకిజం లేదంటే అందులో అర్థం ఏముందని అన్నారు. ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఇన్ డిఫరెంట్.. దానిపై కూడా అధ్యయనం చేయాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కుటంబమంతా రాజకీయంగా, సామాజికపరంగా విజయాలు సాధించిన కుటుంబమని... ఈ పుస్తకం ఆవిష్కరణ ద్వారా మరో విజయాన్ని సాధించగలరని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నార్నారు.
గతం వద్దు.. సరదాగా ఉండాలనుకుంటున్నా: దగ్గుబాటి
కాగా.. విశాఖ గీతం యూనివర్శిటీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. అలాగే ఎంపీ దగ్గుబాటి పురంరేశ్వరి, శ్రీ భరత్ పాల్గొన్నారు. వేదికపై చంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్ర పుస్తకంలో.. చేయాలని లోతుగా అధ్యయనం చేసి అందులో కొన్ని అంశాలను మాత్రమే 340 పేజీల్లో రాసినట్లు తెలిపారు. ఆది నుంచి నేటి వరకు టెక్నాలజీతో సహా అన్ని అంశాలను, ఇందులో క్రోడీకరించానన్నారు. తాను వేదికపై ఎక్కి 30 సంవత్సరాలయిందని.. రాజకీయాల్లో ఉన్నా పుస్తకాలు రాస్తారా అని చాలామందికి అనుమానం ఉంటుందని.. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని అడిగారన్నారు. ఇప్పటికీ నాలుగు పుస్తకాలు రాశానని.. ఇది ఐదో పుస్తకమని.. దీన్ని మాత్రం తాను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో టెక్నాలజీ ద్వారా 50 ఏళ్లు బ్రతకొచ్చు అంటున్నారని.. చంద్రబాబు 50 సంవత్సరాలు అంటే మీ అబ్బాయి బాధపడతాడేమో అంటూ చలోక్తులు వేశారు దగ్గుబాటి. ‘చాలామంది చంద్రబాబుకు నాకు విభేదాలు అంటారు.. ఒకప్పుడు గతంలో ఉండేవి.. ఇది నిజం. కాలంతో పాటు మనం మారాలి. భవిష్యత్తు అనేది ఆశాజనకంగా ఉండాలి. నాకు కోరిక లేవు.. కుటుంబం ఆత్మీయులతో సరదాగా ఉండాలి. నేను చాలా సభల్లో పాల్గొన్నా.. 30 ఏళ్లలో వేదిక మీద మాట్లాడుతున్నా.. ఒక మంచి ఉపన్యాసం చేశానని భావిస్తున్నా. చంద్రబాబు చేస్తున్న కృషికి అభినందనలు.. జరిగిపోయిన గతం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు’ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Chandrababu - Modi Tweet: ఎమ్మెల్సీల విజయంపై మోదీ అభినందనలు.. థాంక్స్ చెప్పిన సీఎం
BJP victory: బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్
Read Latest AP News And Telugu News