Share News

Deputy CM: విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన..

ABN , Publish Date - Apr 07 , 2025 | 08:15 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి పెందుర్తి, అనంతగిరి, అరకులోయ మీదుగా రోడ్డు మార్గంలో డుంబ్రిగుడ చేరుకుంటారు. చాపరాయి జలవిహారిలో మత్స్యాలమ్మను సందర్శిస్తారు.

Deputy CM: విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన..
AP Deputy CM Pawan Kalyan

విశాఖ: ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోమవారం విశాఖ (Visakha) రానున్నారు. ఇక్కడ గిరిజన గ్రామాల్లో రెండు రోజులు పర్యటించనున్నారు. మొదటి రోజు ‘అడవి తల్లి బాట’ (Adavi Talli Baata) పేరుతో చేపట్టిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టునున్నారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో గిరిజన ఆవాసాల సంరక్షణ, ముఖాముఖి కార్యక్రమాలు, బహిరంగ సభ నిర్వహిస్తారు. రెండవ రోజు మంగళవారం సుంకరమెట్ట ప్రాంతంలో నిర్మించిన వుడెన్ బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖకు పయనమవుతారు.

Also Read..: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం


పవన్ కల్యాణ్ పర్యటన వివరాలు..

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి పెందుర్తి, అనంతగిరి, అరకులోయ మీదుగా రోడ్డు మార్గంలో డుంబ్రిగుడ చేరుకుంటారు. చాపరాయి జలవిహారిలో మత్స్యాలమ్మను సందర్శిస్తారు. అనంతరం చాపరాయి గెడ్డ మీదుగా పెదపాడు పీవీటీజీ గ్రామానికి చేరుకుంటారు. పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలను పరిశీలిస్తారు. గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. తరువాత డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేస్తారు. రాత్రికి అరకులోయ చేరుకుని ఏపీటీడీసీ అతిథిగృహంలో బస చేస్తారు.


రెండో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు అరకులోయ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఇదే మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుంటారు. అటవీశాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం పయనమవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, జేసీ అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ పర్యవేక్షిస్తున్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో సోమవారం చాపరాయి జల విహారిలో పర్యాటకుల ప్రవేశాన్ని రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పరారీలోనే కాకాణి.. పోలీసుల వైఫల్యం..

సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

For More AP News and Telugu News

Ad

Updated Date - Apr 07 , 2025 | 08:15 AM