BJP: వారితో కలిసి పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం: పాకా
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:23 PM
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.

విజయవాడ: బీజేపీ రాజ్యసభ అభ్యర్థి (BJP Rajya Sabha candidate)గా ఎన్డీయే కూటమి (NDA Kutami) తరపున పాకా వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana)ను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విజయవాడలో నామినేషన్ (Namination) దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పాకా మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తాను బీజేపీలో పని చేస్తున్నానని, బీజేపీ పట్టణ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర నేతగా ఎదిగానని, డ్రాప్టింగ్ కమిటీ ఛైర్మన్‌గా, కేంద్ర మంత్రుల బృందానికి కన్వీనర్‌గా, క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్‌గా పని చేశానని అన్నారు.
నాకు రాజ్యసభ ఎంపికే నిదర్శనం
వెనుకబడిన తరగతుల వారికి పార్టీలో ప్రాధాన్యత, పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు వస్తుందనేందుకు తనకు రాజ్యసభ ఎంపికే నిదర్శనంమని పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర నేతలు అందరూ తన పేరు సూచించింనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని అన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం చేస్తూ కూటమి లక్ష్యాలను ముందుకు తీసుకెళతానన్నారు. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకునేలా కలిసి పని చేస్తామని, దేశం హితం, రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసి ప్రయాణిస్తామని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలో జరిగే అభివృద్ధిలో తనకు భాగస్వామ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. మోదీ, అమిత్ షా, నడ్డాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. వివాదాస్పద చట్టాలు పక్కన పెట్టి మోదీ తీసుకునే నిర్ణయాలు ఆదర్శంగా ఉన్నాయని పాకా వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు.
Also Read: వైసీపీ హయాంలో జరిగిన పాపాలు బయటకు..
మేం సమకాలీకులం: శ్రీనివాస వర్మ
పాకా సత్యనారాయణ మొట్టమొదటి నుంచీ బీజేపీ కోసం పని చేశారని, ఆయన సేవలు గుర్తించి రాజ్యసభకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. పార్టీని నమ్ముకుని పని చేసిన వ్యక్తికి సముచిత స్థానం దక్కిందని అన్నారు. తాను, ఆయన భీమవరం రోడ్లపై ఒకే బండి మీద తిరిగామని, 35 సంవత్సరాలుగా మేము కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా మేమిద్దరం రాష్ట్రం కోసం కలిసి పని చేస్తామని అన్నారు. కార్యకర్తలు సేవలను గుర్తించి ఇటీవల పార్టీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, తాను, పాకా సత్యనారాయణ, సోము వీర్రాజు, సత్యకుమార్‌లు సమకాలీకులమని తెలిపారు. మేమంతా కలిసిపని చేశామని.. ఇప్పుడు కలిసి పదవుల ద్వారా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యామన్నారు. కష్టపడి పని చేసే కార్యకర్తలకు పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని శ్రీనివాస వర్మ అన్నారు.
పాకా మంచి పనిమంతుడు: సోము వీర్రాజు
పాకా సత్యనారాయణ మంచి పనిమంతుడని టీడీపీలో పదవి వచ్చే అవకాశం ఉన్నా ఆ పార్టీలోకి వెళ్ల లేదని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ కోసం కమిట్ మెంట్ తో పని చేశారని తాను అధ్యక్షుడుగా ఉన్న సమయంలో అనేక బాధ్యతలు అప్పగించామని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ గా నియమించానని, ఎటువంటి బాధ్యత ఇచ్చినా కాదనకుండా సమర్ధవంతంగా పని చేసేవారని అన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఆయన సేవలకు గుర్తింపు లభించిందన్నారు. బీజేపీ అధిష్టానం పని చేసే వారిని తప్పకుండా గుర్తిస్తుందని, పాకాకు రాజ్యసభ బాధ్యత ఇచ్చినందుకు అధిష్టానానికి తన ధన్యవాదాలు అని, ఇప్పుడు ఆయన పని తీరు, సేవలు దేశం కూడా గుర్తిస్తుందని సోము వీర్రాజు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభ వార్త..
గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
పాకిస్థాన్ దేశస్థులు భారత్‌ను వీడేందుకు చివరి రోజు..
For More AP News and Telugu News