Share News

Ganta Srinivas: వైసీపీలో చివరకు మిగిలేది ఆయన ఒక్కరే..

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:39 PM

Ganta Srinivas: రాష్ట్రంలో జగన్ అక్రమాలు చేస్తే, విశాఖలో అంతకుమించి అరాచకాలు చేశారని విజయసాయిపై గంటా వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తుంటే జాలి, నవ్వు, ఆశ్చర్యం వస్తుందన్నారు. ఆయన ద్వారా నష్టపోయిన వారికి ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సాయి రెడ్డి విశాఖలో చేసిన పనులను ప్రజలు మర్చిపోరని అన్నారు. చేసిన తప్పులన్నింటికీ చట్టాపరంగా చర్యలు ఉంటాయని.. తప్పించుకోలేరని.. బాధ్యులవుతారు అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Ganta Srinivas: వైసీపీలో చివరకు మిగిలేది ఆయన ఒక్కరే..
MLA Ganta Srinivas Rao

విశాఖపట్నం, జనవరి 25: విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ సాయి రెడ్డి ఉన్న ఐదేళ్లు.. విశాఖ ప్రజలకు ఒక పీడకల అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కన్ను పడిన భూములు వారికి దాకాల్సిందే అని అన్నారు. తన భూములే చాలా వరకు ఉన్నాయని.. బెదిరించి తీసుకుని వారి కుటుంబాల పేరు మీద మార్పించుకున్నారని ఆరోపించారు. వైజాగ్ పైల్స్ పేరుతో గతంలో ఆ వివరాలను బయటపెట్టామన్నారు. విశాఖలో అనేక మందిని బెదిరించి కూల్చివేతలు చేశారని.. భూములు ఆక్రమించుకున్నారని తెలిపారు.


రాష్ట్రంలో జగన్ అక్రమాలు చేస్తే, విశాఖలో అంతకుమించి అరాచకాలు చేశారన్నారు. ఆయన ట్వీట్ చూస్తుంటే జాలి, నవ్వు, ఆశ్చర్యం వస్తుందన్నారు. ఆయన ద్వారా నష్టపోయిన వారికి ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సాయి రెడ్డి విశాఖలో చేసిన పనులను ప్రజలు మర్చిపోరని అన్నారు. చేసిన తప్పులన్నింటికీ చట్టాపరంగా చర్యలు ఉంటాయని.. తప్పించుకోలేరని.. బాధ్యులవుతారు అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ మునుగుతున్న పడవ అని... చివరికి జగన్ తప్పితే ఎవరూ మిగలరంటూ కామెంట్స్ చేశారు. జగన్‌కు నీడ లాంటి వ్యక్తి భాగస్వామి.. రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం అవుతుందన్నారు.

ఎంపీ పదవికి రాజీనామా.. కూటమి నుంచి డబ్బులు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు


త్వరలోనే అయోధ్య రామయ్య మన జిల్లా నుంచి కూడా ఒక రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేస్తున్నారని తెలిపారు. వైసీపీ తాజా పరిస్థితికి విజయసాయిరెడ్డి రాజీనామా ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు. చివరికి జగన్ ఏకాకిగా మిగిలిపోతారన్నారు. పార్టీ పరిస్థితి ఇలా తయారవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఆటిట్యూడ్ కారణమన్నారు. వైసీపీ నిజ స్వరూపం బయటపడిందని.. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ విషయంలో వైసీపీ కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. దావోస్ పర్యటనలో చంద్రబాబు, లోకేష్ పెట్టబడులాకర్షించే ప్రయత్నం చేశారని తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, సంస్థలు మరిన్ని సంస్థలు వస్తున్నాయన్నారు. గతంలో ఏపీకి రావాలంటే భయపడే పరిస్థితి ఉందని.. మళ్లీ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నామని తెలిపారు. వైసీపీ అనవసర రాజకీయాలు మాని పార్టీని, చక్కదిద్దుకుంటే బాగుంటుంది అంటూ గంటా శ్రీనివాస్ హితవుపలికారు.


ఇవి కూడా చదవండి..

రేపు భారత మాతకు మహాహారతి

TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్‌ రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 12:39 PM