Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..
ABN , Publish Date - Apr 30 , 2025 | 08:07 AM
సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.

అమరావతి: సింహాచలం (Simhachalam)లో జరిగిన ఘోర ప్రమాదం (accident)పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramnarayana Reddy) విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాయపడిన వారికీ తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, సింహాచలంలోని ఘాట్ రోడ్డులో జరిగిన దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంబులెన్సులు రంగంలోకి దిగాయని, కలెక్టర్, హోం మంత్రి అనిత, సహచర మంత్రులు కూడ తక్షణమే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో బలమైన రక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: సింహాచలం ఘటన నన్ను కలచివేసింది..
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న..
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, సింహాచలంలోని ఘాట్ రోడ్డులో జరిగిన దుర్ఘటనపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం మరి కొంతమందికి గాయాలు అవ్వడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అయ్యన్నపాత్రుడు భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి నారాయణ
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తుల మృతికి సంతాపం తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి నారాయణ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహాచలంలో ఘోర ప్రమాదం..7 గురు మృతి
1300 కోట్లతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి: సంధ్యారాణి
అడ్డగోలు భూపందేరాలు చేసింది జగనే: అశోక్‌బాబు
For More AP News and Telugu News