Andhra Pradesh Government Initiatives: ఏపీకి మరో భారీ పెట్టుబడిపై మంత్రి లోకేష్ సంచలన ట్వీట్
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:15 AM
ఏపీకి మరో భారీ పెట్టుబడిపై మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ..జగన్ హయాంలో రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన ఒక ప్రముఖ పరిశ్రమ ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రాబోతోందని వెల్లడించారు.
విశాఖ: ఏపీకి మరో భారీ పెట్టుబడిపై మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ..జగన్ హయాంలో రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన ఒక ప్రముఖ పరిశ్రమ ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రాబోతోందని వెల్లడించారు. 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిందన్న మంత్రి లోకేష్.. అదే కంపెనీ తుఫాన్ మదిరిగా మళ్లీ ఏపీకి రాబోతోందని పేర్కొన్నారు.
కాగా, నేడు విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో నేడు పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. పెట్టుబడిదారులతో చంద్రబాబు, లోకేష్ సమావేశం కానున్నారు. పలు అభివృద్ధి పనులకు లోకేష్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇండియా-యూరప్ బిజినెస్ భేటీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చించనున్నారు. సాయంత్రం 'విశాఖ ఎకనమిక్ రీజియన్' కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి 'స్పెషల్ మీటింగ్ ఆఫ్ సీఐఐ నేషనల్'కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.
Also Read:
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత యూపీఎస్సీ కోచింగ్
పేద మహిళ సొంతింటి కల నెరవేర్చిన పవన్
For More Andhra Pradesh News