AP High Court Serious: ఆ నిర్మాణాల తొలగింపులో నిర్లక్ష్యంపై హైకోర్ట్ సీరియస్
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:36 PM
AP High Court Serious: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు సంబంధించిన నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పూర్తిగా నిర్మాణాలు తొలగించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చూస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

అమరావతి, మార్చి 5: విశాఖ భీమునిపట్నం ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణాలను పూర్తిగా తొలగించకపోవడంపై ఏపీ హైకోర్ట్ (AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణల తొలిగింపులో నిర్లక్ష్యంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి (Former MP Vijayasai Reddy) కుమార్తె నేహా రెడ్డి సీఆర్‌జెడ్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Jana Sena Corporator Peethala Murthy Yadav) హైకోర్ట్‌లో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు
దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరుగగా.. ఈరోజు (బుధవారం) మరోసారి హైకోర్టులో విచారణకు విచారణకు వచ్చింది. కేవలం పైకి కనిపించే గోడను తొలగించి ఇసుక కింద ఉన్న గోడను తొలగించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కోర్టు. నివేదికలో ఈ విషయాన్ని చెప్పకపోవడంపై మండిపడింది. భూమి లోపల ఉన్న గోడను కూడా తొలగించాలని అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అయ్యే ఖర్చును మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలని జీవీఎంసీకి ఆదేశించింది.
Teenmar Mallanna: సీఎం రేవంత్‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్
కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిటీ వేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి సొమ్మును కంపెనీ నుంచి వసూలు చేయాలని స్పష్టీకరించింది. ప్రైవేటు కంపెనీపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సంబంధిదిత అధికారికి స్పష్టం చేసింది. భీమునిపట్నం సమీపంలోని సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు(రెస్టోబార్ల) విషయంలో కూడా సర్వే చేయాలని అధికారుల బృందానికి న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే వాయిదా నాటికి సమాచారం తమ ముందు ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి...
Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
Lokesh Speech at AP Assembly: తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News