Share News

Indigo Airlines: విశాఖ-బెజవాడ విమాన సర్వీస్‌ పునరుద్ధరణ

ABN , Publish Date - May 06 , 2025 | 04:08 AM

జూన్ 1 నుంచి ఇండిగో సంస్థ విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీస్‌ను పునఃప్రారంభిస్తోంది. ఉదయం 7.15కి విజయవాడ నుంచి బయలుదేరి 8.25కి విశాఖ చేరుకుని, తిరిగి 8.45కి బయలుదేరి 9.50కి విజయవాడకు చేరుకుంటుంది.

Indigo Airlines: విశాఖ-బెజవాడ విమాన సర్వీస్‌ పునరుద్ధరణ

  • జూన్‌ 1 నుంచి విశాఖ-బెజవాడ విమాన సర్వీస్‌

న్యూఢిల్లీ, విశాఖపట్నం, మే 5(ఆంధ్రజ్యోతి): జూన్‌ 1 నుంచి విజయవాడకు ఒక విమానాన్ని నడపడానికి ఇండిగో సంస్థ ముందుకువచ్చింది. ఈ విమానం విజయవాడలో ఉదయం 7.15కు బయలుదేరి 8.25కు విశాఖపట్నం వస్తుంది. ఇక్కడి నుంచి 8.45కు బయలుదేరి 9.50కి విజయవాడ చేరుతుందని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కుమార్‌రాజా, నరేశ్‌కుమార్‌, డీఎస్‌ వర్మ తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ‘ఎక్స్‌’లో స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి రాజధాని విజయవాడ ప్రాంతం మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసులు ఏప్రిల్‌1 నుంచి నిలిచిపోయాయి.

Updated Date - May 06 , 2025 | 04:08 AM