Vijayasai Reddy : వైసీపీకి, పార్టీ పదవులకూ రాజీనామా చేశా
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:34 AM
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకూ రాజీనామా చేశానని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి..

జగన్ మళ్లీ సీఎం కావాలి: విజయసాయిరెడ్డి
అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకూ రాజీనామా చేశానని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. తన రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపానని తెలిపారు. 2029లో జగన్ భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానన్నారు. వ్యయసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించానని ట్వీట్ చేశారు.