Share News

Urea Bag: యూరియా బస్తా @రూ.500

ABN , Publish Date - Nov 22 , 2025 | 09:24 AM

యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కొరత లేదని, ఎక్కడా అధిక ధలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి.

Urea Bag: యూరియా బస్తా @రూ.500

- బ్లాక్‌తో కొండెక్కిన ధర

- రైతులను పిండేస్తున్న వ్యాపారులు

- ఖరీఫ్‌ పరిస్థితులు రబీలోనూ పునరావృతం

- కేటాయింపులు.. అమ్మకాలు అంతటా అక్రమమే

(చీరాల(బాపట్ల), ఆంధ్రజ్యోతి): ఎరువులు పుష్కలంగా ఉన్నాయి.. ఎక్కడా కొరత లేదు. అవసరం మేరకు ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తున్నాం. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అదనపు ధర కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎవరైనా అలా వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి ఆ వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం.. అని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. రెండు రెట్ల ధరకు యూరియా విక్రయిస్తున్నా పట్టించుకునే వారే లేరు.


ధర గురించి ప్రశ్నిస్తే యూరియా(Urea) లేదనే సమాధా నంతో రైతులు నిరాశ చెందుతున్నారు. అత్యంత తక్కువ ధరకు లభ్య మవ్వాల్సిన యూరియాను బ్లాక్‌ చేసిన వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. వాస్తవానికి యూరియా బస్తా రూ.266.50. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో బస్తా రూ.500 చెల్లిస్తే తప్ప దొరకడంలేదు. గుంటూరు, బాపట్ల, పల్నాడు(Guntur, Bapatla, Palnadu) జిల్లా అంతటా ఇదే పరిస్థితి. కృత్రిమ కొరత సృష్టించి రైతుల నుంచి ఎక్కువ మొత్తం లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎరువులు కేటాయింపులు.. అమ్మకాలు అన్నింట్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి.


రబీలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుంది. కాగా ఖరీఫ్‌లో ఏ పరిస్థితి సృష్టించారో అదే పరిస్థితి రబీలోనూ సృష్టించేందుకు కొందరు కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతుంది. రెండో పంట కింద సాగు చేసే మొక్క జొన్నలో అధిక దిగుబడి కోసం ఎకరాకు 12 నుంచి 16 బస్తాల యూరియా వాడుతున్నట్లు వ్యవసాయ శాఖ ఎప్పుడో గుర్తించింది. పల్నాడు ప్రాంతంలో మిరప రైతులు కూడా యూరియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.


ap2.jpg

ఈ నేపథ్యంలో రైతులు ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. మాచర్లలో యూరియా రూ.420 నుంచి రూ.460కి తక్కువ అమ్మే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో చాలాచోట్ల రూ.450 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. కొందరు రైతుల పేరుతో కొందరు, పలుకుబడి ఉపయోగించి మరికొందరు ముందుగానే కొనుగోలు చేసి వాటినే రైతులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.


మేలుకోకపోతే ముప్పే..

ఖరీఫ్‌లో కేటాయింపులకు మించి ప్రభుత్వం యూరియాను సరఫరా చేసింది. అయినా కొరత ఉన్నట్లు ప్రచారం జరిగింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా సొసైటీలకు వెళ్లిన వందల టన్నుల యూరియా కొందరికి మాత్రమే పంచేయడంతో వాస్తవ రైతులు కొరతతో ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రబీలో ఎలా ఉంటుందోనన్న దానిపై సందిగ్థం ఏర్పడుతుంది. వాస్తవానికి రబీలో గుంటూరు జిల్లాకు 55840 మెట్రిక్‌ టన్నులు యూరియా అవసరం అవుతుంది. కానీ నిల్వలు ఆ మేరకు వస్తాయా లేదా అన్న దానిపై అనుమానం నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం నిల్వల్లో 70 శాతం మార్క్‌ఫెడ్‌ ద్వారా సొసైటీ లకు, 30 శాతం డీలర్లకు కేటాయిస్తుంది. లింక్‌ ఉత్పత్తులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు

రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2025 | 10:23 AM