Share News

AP Tourism: భవిష్యత్తు పర్యాటకానిదే

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:49 AM

అంతర్జాతీ య టూరిజానికి గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు.

AP Tourism: భవిష్యత్తు పర్యాటకానిదే

టూరిజానికి గమ్యస్థానంగా ఏపీ

ఈ రంగంలో 20 శాతం వృద్ధి లక్ష్యం

  • డీప్‌ టెక్‌, ఆక్వాకల్చర్‌, లైవ్‌స్టాక్‌తో పాటు పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యం

  • టూరిజం ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు

  • ఐదేళ్లలో 50 వేల హోటల్‌ గదులు నిర్మిస్తాం

  • పర్యాటక సలహాదారుగా రాందేవ్‌ బాబా

  • మదనపల్లిలో వెల్‌నెస్‌ సెంటర్‌.. మినీ ఎయిర్‌పోర్టు

  • నన్ను నమ్మండి.. పెట్టుబడులు పెట్టండి

  • టూరిజం కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు పిలుపు

  • ఈ రంగంలో 20 శాతం వృద్ధి లక్ష్యం

అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీ య టూరిజానికి గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. గ్లోబల్‌ ఫోరం ఫ ర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(జీఎఫ్‌ఎస్‌టీ), ఏపీ టూరిజం శాఖ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన టూరిజం కాన్‌క్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధిలో పర్యాటక రంగం గేమ్‌ చేంజర్‌ కాబట్టే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామని తెలిపారు.


కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే టూరిజానికే భవిష్య త్తు ఉందని దశాబ్దాల క్రితం తాను చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతోందన్నారు. ఇక భవిష్యత్తు అం తా పర్యాటక రంగానిదేనని స్పష్టం చేశారు. ఈ రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చాన్నారు. డీప్‌ టెక్‌, ఆక్వాకల్చర్‌, లైవ్‌స్టాక్‌ రంగాలతో పాటు పర్యాటకం చాలా బలంగా ఉంద ని, ఈ నాలుగింటికీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ఐటీ, ఉత్పత్తి పరిశ్రమలు, వ్యవసాయం కంటే పర్యాటక రంగం ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ఏపీ పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధి నమోదు లక్ష్యంగా పని చేస్తున్నాం. రాష్ట్రంలో తిరుమల, మరో 22 ప్రముఖ దేవాలయాలున్నాయి. బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలు, అడవులతో పాటు సుదూర తీర్ర ప్రాం తం ఉంది.


కోనసీమ కేరళ కంటే అద్భుతమైన ప్రాం తం. ఇప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టు కూడా చేపడుతున్నాం. టూరిజం ప్రాజెక్టులకు వేగవంతంగా అనుమతులు ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టాం. ఈ విషయంలో ఒక్క గంట కూడా వృథా కాకుండా చూసుకుంటాం. పర్యాటక ప్రాజెక్టులకు విద్యుత్‌ సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. టూ రిజంలో ఏపీ దేశానికి మోడల్‌గా మారడంతో పాటు నం.1గా నిలవాలన్నదే లక్ష్యం. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేల హోటల్‌ గదులున్నాయి. ఐదేళ్లలో వాటిని 50 వేలకు పెంచుతాం. హెలీ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు ముందుకొచ్చా యి. అమరావతి నుంచి శ్రీశైలంతో పాటు హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు నుంచి శ్రీశైలానికి హెలీకాప్టర్‌ టూరిజంపై దృష్టి పెట్టాలి. మూడు దశాబ్దాల క్రితం ఐటీని ప్రమోట్‌ చేశా. ఇప్పుడు పర్యాటకాన్ని ప్రమోట్‌ చేస్తున్నా. టూరిజం రంగంలో పెట్టుబడు లు పెట్టండి. మీ పెట్టుబడులు సురక్షితం. ఇప్పుడే పెట్టుబడులు పెట్టాలి. లేకుంటే అవకాశాలు కోల్పోతారు’ అని పెట్టుబడిదారులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.


‘రాష్ట్రంలో 703రకాల పౌర సేవల్లో ప్రస్తు తం 500కు పైగా సేవలను వాట్సాప్‌ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15 తర్వాత అన్ని పౌర సేవలు వాట్సాప్‌ ద్వారానే పొందవచ్చు. దీనివల్ల ఉద్యోగాలు ఉండవని ప్రచారం చేస్తున్నారు. కానీ, టూరిజం రంగంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. రత న్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా యవతకు నైపు ణ్యం కల్పించాలని నిర్ణయించాం. విశాఖ, తిరుపతి, అమరావతి, రాజమండ్రి, అనంతపురంలో టూరి జం హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం’ అని చంద్రబా బు వివరించారు. రాష్ట్రంలో వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటైతే యోగా, ఆయుర్వేద, నేచురోపతి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మదనపల్లిలో ఏర్పాటు చేయనున్న వెల్‌నెస్‌ సెంటర్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అవసరమైతే మదనపల్లికి చిన్న ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆర్గానిక్‌ ఉత్పత్తుల్లో ఏపీ టాప్‌లో ఉండాలని ఆకాంక్షించారు.fgt.jpg


సలహాదారుగా రాందేవ్‌ బాబా

యోగాతో ప్రజల్ని ప్రభావితం చేసినట్లే ఏపీ పర్యాటకాన్ని, ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసేందుకు సహకరించాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబాను సీఎం చంద్రబాబు కోరారు. పర్యాటకం, వెల్‌నెస్‌ కేంద్రాలకు ఆయన్ను సలహాదారుగా నియమిస్తున్నట్లు చెప్పారు. పతంజలి సంస్థను అగ్రస్థానానికి చేర్చినట్టే ఏపీ పర్యాటక రంగాన్ని మార్కెటింగ్‌ చేయాలన్నారు. 30 ఏళ్ల నుంచి రామ్‌దేవ్‌ బాబాను చూస్తున్నానని, అదే ఫిట్‌నెస్‌, అంతే యాక్టివ్‌గా ఉన్నారని కొనియాడారు.

సూర్యలంకలో వెల్‌నెస్‌ కేంద్రం

బాపట్ల: వెల్‌నెస్‌ కేంద్రాలకు ఏపీ ప్రపంచ గమ్యస్థానం అవుతుందని రాందేవ్‌ బాబా అన్నారు. సూర్యలంక తీరంలో ప్రపంచ స్థాయి వెల్‌నెస్‌ కేం ద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన తన బృందంతో కలసి బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో పర్యటించారు.


బాబు దార్శనికుడు..: రాందేవ్‌ బాబా

దేశంలో చంద్రబాబు కంటే దార్శనికత కలిగిన నేత, ప్రజాహితం కోరే నాయకుడు ఎవ్వరూ లేరని రాందేవ్‌ బాబా కొనియాడారు. క్రియేటివిటీ, ప్రొడక్టివి టీ, ప్రొఫెషనలిజం, అనుభవం వంటి అంశాలకు చం ద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అన్నారు. తెలుగు ప్రజలకు ప్యారిస్‌, స్విట్టర్లాండ్‌, టర్కీ లాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్న ప్రజలు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాల ను కూడా గుర్తించాలని సూచించారు. హార్స్‌లీ హిల్స్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పతంజలి సంస్థ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. దిండి లాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్‌ క్రూయిజ్‌ బోట్‌ ప్రాజెక్టు ద్వారా సంప్రదాయ వివాహాలు జరిపించేలా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్రాజెక్టు చేపడతామని చెప్పారు. ఏపీలోని పర్యాటక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తామని బాబా హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏపీ పర్యాటకానికి ప్రచారం చేస్తానన్నారు. ప్రసంగం ప్రారంభంలో ఆయన తెలుగులో మాట్లాడారు. తెలుగులో ప్రసంగిస్తూనే చంద్రబాబును కొనియాడారు.

Updated Date - Jun 28 , 2025 | 04:02 AM