Share News

Tirupati News: అటు కల్తీ నెయ్యి.. ఇటు పరకామణి

ABN , Publish Date - Nov 13 , 2025 | 10:53 AM

టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐ భాగస్వామ్యమున్న సిట్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.

Tirupati News: అటు కల్తీ నెయ్యి.. ఇటు పరకామణి

- తిరుపతిలో ముమ్మరంగా టీటీడీ కేసుల విచారణ

తిరుపతి: టీటీడీ(TTD)కి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐ(CID) భాగస్వామ్యమున్న సిట్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.

- తిరుపతిలోని టీటీడీ భూదేవి కాంప్లెక్సులో సీబీఐ డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని సీబీఐ డీఎస్పీలు, సిట్‌ దర్యాప్తు అధికారి వెంకట్రావు ఇతర పోలీసు అధికారులు కల్తీ నెయ్యి కేసులో బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిలిజైన్‌, విపిన్‌జైన్‌తో పాటు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళ, బుధవారాల్లో విచారించారు. దీంతో ఇక్కడ కూడా హడావుడి నెలకొంది.


nani2.3.jpg

- మరోవైపు శ్రీ పద్మావతి అతిథి గృహం కేంద్రంగా వారం రోజులుగా పరకామణిలో జరిగిన చోరీ కేసును హైకోర్టు ఆదేశాల మేరకు ఏకంగా సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు రవికుమార్‌, అతడి కుటుంబ సభ్యులను తొలుత విచారించారు. ఆ తర్వాత ఈ కేసు సమయంలో తిరుమల(Tirumala)లో వన్‌టౌన్‌ సీఐగా పనిచేసిన జగన్మోహన్‌ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీరెడ్డి, అప్పటి టూ టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌,


పరకామణి డిప్యూటీ ఈవో మల్లికార్జునరావు, టీటీడీ సెక్యూరిటీ అధికారులు సుబ్బరాజు, రామచంద్ర, సీసీ కమాండ్‌ యూనిట్‌ గార్డు చంద్రతో పాటు జయచంద్రారెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. దీంతో అధికారుల రాకపోకలు, విచారణ కోసం వస్తున్న వారితో పద్మావతి అతిథి గృహం సందడిగా మారింది.

nani2.jfif

- ఇంకోవైపు పరకామణి చోరీ కేసులో నిందితుడైన రవికుమార్‌.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ విచారిస్తోంది. ఈ కేసు కూడా తిరుపతి కేంద్రంగా నడుస్తోంది. జరుగుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సిమెంట్‌ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

సైబర్‌ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్‌ ఎడ్జ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2025 | 10:53 AM