Gudivada: గుడివాడలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసు బలగాలు..
ABN , Publish Date - Jul 12 , 2025 | 07:32 PM
గుడివాడలో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిరసనల మధ్యే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో..

విజయవాడ: గుడివాడలో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిరసనల మధ్యే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మీటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్తున్న జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక వాహనాన్ని నాగవరపు పాడు జంక్షన్ వద్ద టీడీపీ మహిళ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను మీటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లి తీరాలంటూ ఆమె భీష్మించుకుంది. దీంతో పోలీసులకు కలుగజేసుకుని ఆమె వాహనాన్ని అక్కడ నుంచి పంపించేశారు. ఈ సమావేశానికి పేర్ని నాని వస్తారంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ పేర్ని నాని వస్తే అడ్డుకొని తీరుతామంటూ టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. పోలీసులకు ఇరు పార్టీల నేతలకు నచ్చజెబుతున్నారు.
గుడివాడ నియోజకవర్గం లింగవరంలో వైసీపీ నేత కొడాలి నానికి (Kodali Nani) సంబంధించిన కన్వెన్షన్ సెంటర్‌లో బాబు ష్యూరీటీ.. మోసం గ్యారంటీ.. కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొడాలి నాని, జిల్లా వైసీపీ నాయకులు హాజరుకాలేదు. దీంతో స్థానికుల నేతృత్వంలోనే సమావేశాన్ని నిర్వహించారు. అయితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా అదే సమయంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీంతో నాగవరప్పాడు సెంటర్‌కు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్
అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News