Paritala Sriram: అనుమానాలొద్దు.. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తాం
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:44 PM
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ తప్పక పరిష్కారం చూపిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణంలోని శివానగర్, కేశవనగర్‌లో జరిగిన ‘మీ సమస్య.. మా బాధ్యత’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, అక్కడే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

‘మీ సమస్య.. మా బాధ్యత’లో పరిటాల శ్రీరామ్
ధర్మవరం(అనంతపురం): ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ తప్పక పరిష్కారం చూపిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్(Pritala Sriram) అన్నారు. పట్టణంలోని శివానగర్, కేశవనగర్‌లో జరిగిన ‘మీ సమస్య.. మా బాధ్యత’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, అక్కడే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కేశవనగర్‌లో గ్రీవెన్స్ నిర్వహించారు.
సచివాలయ సిబ్బంది, మున్సిపల్, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తమ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయని అన్నారు. వాటిని పరిష్కరించే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. సచివాలయ స్థాయిలో ఉన్నవి ఇక్కడే పరిష్కరిస్తామని, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని అన్నారు.
వైసీపీ(YCP) హయాంలో నిర్ణయాలవల్ల పింఛన్లు, ఇంటి స్థలాల పట్టాల విషయంలో అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని అన్నారు. పరిశీలించి, న్యాయం చేస్తామని అన్నారు. అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్‌కు లేదని విమర్శించారు. వారి ఎమ్మెల్యేలతో కలిసి అక్కడ పర్యటిస్తే జరిగిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఏపీసీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమతం కాటమయ్య, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి చింతలపల్లి మహేశ్ చౌదరి, పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, 7వ వార్డు ఇన్‌చార్జి పల్లపు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News