Home » Dharmavaram
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ తప్పక పరిష్కారం చూపిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణంలోని శివానగర్, కేశవనగర్‌లో జరిగిన ‘మీ సమస్య.. మా బాధ్యత’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, అక్కడే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
మండలంలోని ము చ్చురామి గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే రహ దారికి అడ్డంగా కొంతమంది వ్యాపారులు కంచె ఏర్పాటు చేశారని రైతులు అవేదన వ క్తం చేశారు. సోమవారం ఆ గ్రామ రైతులు సీపీఐ నాయకుడు మధుతో కలసి స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదికలో తహసీ ల్దార్ సురేష్‌బాబుకు వినతిపత్రం అందచేశారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ప్రతి అర్జీని విచారించి తక్షణమే పరిష్క రించాలని ఆర్డీఓ మహేశ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం ప్రజా సమస్య ల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆర్డీఓ నిర్వహించారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని తహసీల్దార్ సురేశకుమార్ తదితరులు సూ చించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం ధర్మవరం వనటౌన, టూటౌన పోలీస్ స్టేషనల ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు తదితరులు అవగా హన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సురేశకుమార్, ఎంఈఓ గోపాల్‌నాయక్, టూటౌన సీఐ రెడ్డప్ప, రూరల్ సీఐ ప్రభాకర్, ముదిగుబ్బ రూరల్ సీఐ శ్యామరావు, ఎక్సైజ్ శాఖ సీఐ చంద్రమణి హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం సచివాల య ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి, బదిలీలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారించాలంటూ మండలంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు బుధవారం ఆ సంఘం నాయకులతో కలిసి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ప్లకార్డులు పట్టుకుని పట్టణంలోని కాలేజ్ సర్కిల్ నుంచి ఎంపీ డీఓ కార్యాలయం వద్దకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుచే యడంతో విద్యార్థుల తల్లుల ముఖాల్లో ఆనందం వెల్లివి రిస్తోందని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. దీంతో సోమ వారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
మండలంలోని రావులచెరువు గ్రామ సచివాలయానికి వైసీపీ జెండా రంగులు ఇం కా దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. సచివాలయానికి ముందుభాగంలోనే వైసీపీ జెండా రంగులు వేశారు. అప్పట్లో ప్రభు త్వ భవనాలకు పార్టీజెండా రంగులు వేయకూ డదని హైకోర్టు ఆదే శాలు ఇచ్చిన అవేవీ పట్టించుకోకుండా ఆ గ్రామ సచివాలయానికి వైసీీపీ రంగులు వేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన ఆరోగ్య మందిర్) భవనాలను మంజూరుచేసింది. వీటి నిర్మా ణానికి మూడేళ్ల క్రితమే గత వైపీపీ పాలనలో నిధులు మంజూరుచేసినా నేటికీ పూర్తి కాలేదు. దీంతో పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి. గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేం ద్రాల భవనాలను గత వైసీపీ ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో మంజూ రు చేసింది.
మండలంలోని తాటిమాను గుంత గ్రామంలో 20రోజులకు పైగా తాగునీటి ఎద్దడి నెలకొందని, పట్టిం చుకునే వారు లేరని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో వంద కుటుం బాలున్నాయి. అందరూ వ్యవసాయ పనులు, కూలి పనులకు వెళ్లేవారే. గ్రామంలోని రక్షిత తాగునీటి బోరు మోటారు దాదాపు ఇరవై రోజుల క్రితం కాలిపోయింది. బోరులో నుంచి మోటారు, పైపులు బయటకు తీసి 20 రోజులకు పైగా అవుతోంది.
మండలంలోని నడిమిగ డ్డపల్లి ఎస్సీకాలనీలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కాల నీలో సుమారు 30 కుటుం బాలు జీవనం సాగిస్తున్నా యి. అయితే కాలనీకి సం బంధించిన పంచాయతీ బో రు మరమ్మతులకు గురి కా వడంతో తాగునీటికి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.