Alluri Seetharamaraju District: విష సర్పాల కలకలం
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:18 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ బలడ గ్రామంలో లో పాములు కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన గొల్లోరి మెద్దు నూతన ఇంటి నిర్మాణం కోసం శనివారం గోతులు తవ్వుతుండగా..

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ బలడ గ్రామంలో లో పాములు కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన గొల్లోరి మెద్దు నూతన ఇంటి నిర్మాణం కోసం శనివారం గోతులు తవ్వుతుండగా పెద్ద బండరాయి అడ్డు వచ్చింది. ఆ రాయిని తీస్తుండగా.. పది అడుగుల నాగుపాము బయటకు రావడంతో స్థానికులు దానిని హతమార్చారు. ఆతర్వాత బండరాయిని తొలగించగా... దాని కింద పాము పిల్లల గుంపు కనిపించింది. వాటిని కూడా గ్రామస్థులు చంపేసి, దహన కార్యక్రమం నిర్వహించారు. కాగా, రంగబయలు పంచాయతీ వలజంగి సమీపంలో శుక్రవారం భారీ కొండచిలువ మేకను మింగేస్తుండగా స్థానికులు గమనించి, కొండచిలువను చంపేశారు.
- ముంచంగిపుట్టు, ఆంధ్రజ్యోతి