Share News

Liquor Scam SIT Probe: మీ అబ్బాయిని రమ్మనండి

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:30 AM

మద్యం కుంభకోణం కేసులో పరారీలో ఉన్న కసిరెడ్డి రాజ్‌ను విచారణకు తీసుకురావాలని ఆయన తండ్రి ఉపేందర్‌రెడ్డిని సిట్‌ అధికారులు కోరారు. రాజ్‌ ఎక్కడున్నాడో తెలియదని ఉపేందర్ సమాధానమిచ్చారు

Liquor Scam SIT Probe: మీ అబ్బాయిని రమ్మనండి

  • విచారణకు సహకరిస్తే మీకే మంచిది రాజ్‌ కసిరెడ్డి తండ్రికి సిట్‌ సూచన

  • కొడుకు ఆచూకీ తెలియదన్న ఉపేందర్‌రెడ్డి

  • చివరికి తన వంతు ప్రయత్నం చేస్తానని వెల్లడి

మీ అబ్బాయిని విచారణకు రమ్మనండి.. మాకు సహకరిస్తే మీకే మంచిది..’ అని సిట్‌ అధికారులు రాజ్‌ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌రెడ్డికి సూచించారు. మిమ్మల్ని గౌరవంగా చూశాం కదా..! వాసుదేవరెడ్డిని, విజయసాయిరెడ్డిని అరెస్టు చేశామా అని కూడా అన్నారు. మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా సిట్‌ అధికారులు విజయవాడ పోలీసు కమీషనర్‌ కార్యాలయంలో వరుసగా రెండో రోజూ ఉపేందర్‌రెడ్డిని మూడు గంటలపాటు ప్రశ్నించారు. తన కుమారుడు ఎక్కడున్నాడో తనకు తెలియదని ఆయన బదులిచ్చారు. ఎన్ని సార్లు ప్రశ్నించినా తనకు ఎలాంటి సమాచారం లేదనే చెప్పారు. ‘మేము రాజ్‌ను ఎలాగైనా పట్టుకుంటాం. సహకరిస్తే మీకే మంచిది.. చట్టాన్ని గౌరవించండి’ అని సిట్‌ అధికారులు అన్నారు. కాసేపు మౌనం వహించిన ఉపేందర్‌రెడ్డి.. మీరు చెప్పింది విన్నానని, తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అనంతరం అధికారులు ఆయన్ను పంపివేశారు.

Updated Date - Apr 19 , 2025 | 05:36 AM