Tirumala: కల్తీ నెయ్యి కేసులో విచారణకు రండి
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:35 AM
కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరుకావాలని టీటీడీకి చెందిన పలువురు అధికారులకు సిట్ నోటీసులు జారీచేసింది. నెయ్యి సేకరణ, సరఫరా, నాణ్యతపై వివిధ విభాగాల అధికారులకు ఈ నోటీసులు అందాయి.

టీటీడీలో పలువురికి సిట్ నోటీసులు
తిరుపతి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): కల్తీనెయ్యి కేసులో విచారణకు హాజరుకావాలంటూ టీటీడీకి చెందిన పలువురు అధికారులకు సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) నోటీసులు జారీచేసింది. మూడు రోజుల కిందటే సిట్ అధికారులు ఈ నోటీసులు అందజేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారంలోగా విచారణ నిమిత్తం తమ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నెయ్యి సేకరణకు సంబంధించి టెండర్లు పిలవడం మొదలుకొని నెయ్యి సరఫరా, నాణ్యత వరకూ వివిధ ప్రక్రియలతో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులకు ఈ నోటీసులు అందాయి. ముఖ్యంగా మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, ల్యాబ్‌లకు సంబంధించిన విభాగాల అధికారులు సహ కీలక ఉద్యోగులను పిలిచి విచారించనున్నారు. టీటీడీ పాలనా విభాగానికి సంబంధించిన ఇద్దరు కీలక అధికారులకూ సిట్ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. సిట్ టీటీడీ వైపు దృష్టి సారించడంతో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. కాగా, భోలే బాబా డెయిరీ ప్రతినిధులు మరో ఇద్దరిని సిట్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
For AndhraPradesh News And Telugu News