Share News

Baseball Association: రేపు సీనియర్‌ బేస్‌బాల్‌ జట్ల ఎంపికలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:16 AM

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లా ల బేస్‌బాల్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో 6న సీనియర్‌ బేస్‌బాల్‌ మ హిళ, పురుషుల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జి ల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సరళ శ్రీనివాసరావు తెలిపారు...

Baseball Association: రేపు సీనియర్‌ బేస్‌బాల్‌ జట్ల ఎంపికలు

లబ్బీపేట స్పోర్ట్స్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లా ల బేస్‌బాల్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో 6న సీనియర్‌ బేస్‌బాల్‌ మ హిళ, పురుషుల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జి ల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సరళ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఎంపికలు నాగాయలంకలో జిల్లా పరిషత్‌ ఉన్నత పా ఠశాలలో జరుగుతాయన్నారు. ఎంపికైన క్రీడాకారులు జూలై 12 నుం చి 14 వరకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరగబోయే 7వ సీనియ ర్‌ రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటాయన్నారరు.


ఆసక్తి గల క్రీడాకారులు 6న మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నాగాయలంకలో హాజరుకావాలని సూచించారు. ఎంపికల లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌ కార్డును తీసుకురావాలని తెలిపారు.

Updated Date - Jul 05 , 2025 | 05:16 AM