Tirupati Weather: మండే సూరీడు
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:27 AM
తిరుపతిలో సోమవారం ఉక్కపోతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సూర్యుడు భగభగ మండిపోగా సాయంత్రం వరకూ ఉష్ణోగ్రత తగ్గక ప్రజలు అల్లాడిపోయారు.

ఇంటర్నెట్ డెస్క్: పుణ్యక్షేత్రమైన తిరుపతిలో సోమవారం రోజంతా సూర్యుడు నిప్పులు కుమ్మరించాడు. ఎండ తీవ్రత.. ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. సాయంత్రానికీ ఆ వేడి తగ్గలేదు. భగ భగ మండుతూనే సూర్యుడు కొండల్లోకి జారుకున్నాడు.