Kolusu Parthasarathi: సంక్షేమం విషయంలో చర్చకు సిద్ధం కొలుసు
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:39 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమం అందించామని ఎవరైనా చెబితే కూటమి నాయకులు చర్చకు సిద్ధమని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు.

ఏలూరుసిటీ, జూన్ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమం అందించామని ఎవరైనా చెబితే కూటమి నాయకులు చర్చకు సిద్ధమని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. ఏలూరులోని జడ్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును, అమరావతిని నిర్వీర్యం చేసింది. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది’ అని పార్థసారథి అన్నారు. సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి పాల్గొన్నారు.