MLA Paritala Sunitha: అందరూ ఒకేసారి ఒకే రకం పంట వేయవద్దు
ABN , Publish Date - Nov 26 , 2025 | 10:33 AM
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ఓ సూచన చేశారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంట సాగుచేస్తే గిట్టుబాటు ధరలేక నష్టాలు వస్తున్నాయని, కాబట్టి ఒకే రకం పంట కాకుండా మర్పిడి చేసుకోవాలని ఆమె సూచించారు.
- రైతన్నా-మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం: రైతులంతా ఒకేసారి ఒకే రకం పంట సాగుచేస్తే గిట్టుబాటు ధరలేక నష్టాలు వస్తున్నాయని, ఈ పద్ధతిని విడనాడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Raptadu MLA Paritala Sunitha) సూచించారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతన్నా-మీకోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని మామిళ్లపల్లిలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. రైతన్నల ఇళ్ల వద్దకే వెళ్లి ‘అన్నదాత సుఖీభవ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా’ అని ఆరాతీశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిన కరపత్రాన్ని అందజేశారు. అనంతరం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి రైతులతో సమావేశమై పంటల సాగుపై చర్చించారు. రైతులంతా ఒకేరకం పంట, ఒకే సీజన్‌లో సాగుచేయడం ద్వారా దిగుబడులు అధికమై ధరలు తగ్గి నష్టపోతారన్నారు. వేర్వేరు పంటలు పెట్టుకోవాలన్నారు. ఎప్పుడు, ఏ పంటలు సాగుచేయాలి, తెగుళ్ల నివారణకు ఎటువంటి మందులు పిచికారీ చేయాలన్న అంశాలపై రైతులకు అధికారులు సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కిష్టయ్య, ఏఓ మాధురి, డీసీఎంఎస్, మార్కట్‌యార్డ్ చైర్మన్లు నెట్టెం వెంకటేష్, బోయపాటి సుధాకర్ చౌదరి, కన్వీనర్ పోతుల య్య, మాజీ నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News