Share News

Rajya Sabha Nomination: రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్‌

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:05 AM

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణి సమక్షంలో పత్రాలు అందజేశారు.

Rajya Sabha Nomination: రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్‌

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): కూటమి తరఫున బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్‌ అధికారి వనితారాణికి ఆయన తన నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 06:06 AM