Share News

AP News: పోలీసు పహారాలో.. పుట్టపర్తి

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:11 AM

పోలీసు పహారాలో పుట్టపర్తి కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ పుట్టపర్తికి రానున్నారు.

AP News: పోలీసు పహారాలో.. పుట్టపర్తి

- బాబా శతజయంతికి హాజరుకానున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని

- పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు

పుట్టపర్తి(అనంతపురం): పోలీసు పహారాలో పుట్టపర్తి(Puttaparthy) కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ సతీష్ కుమార్‌ పర్యవేక్షణలో వారం రోజులుగా పట్టణంలో అణువణువు తనిఖీ చేస్తున్నారు.


pandu1.2.jpg

అత్యాధునిక కెమెరాలు, డ్రోన్లు, నైట్‌ విజన్‌ పరికరాలతో ద్వారా రాత్రిపూట నిఘా కొనసాగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, ప్రవేశద్వారాలు, విమానాశ్రయం, హెలీప్యాడ్‌, ప్రశాంతినిలయం, సాయికుల్వంత్‌ సభామండపం, హిల్‌వ్యూ స్డేడియం ప్రాంతాల్లో పట్టిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేహౌండ్స్‌, స్పెషల్‌పార్టీ పోలీసులు, బాంబ్‌స్వ్కాడ్‌, డాగ్‌స్క్వాడ్‌, సాయుధబలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు జరుగుతున్నాయి.


pandu1.jpg

పట్టణంలోకి వచ్చే వాహనాలపై చెకింగ్‌ పాయింట్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన వీధులు, వీఐపీ మార్గాలపై పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ గురువారం మాట్లాడుతూ వీవీఐపీల భద్రతను దృష్టిలో ఉంచుకుని పటిష్ట బందోబస్తు చర్యలను చేపడుతున్నామన్నారు. సత్యసాయి జయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున కృషి చేస్తున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 11:11 AM