Share News

Poultry Farm Owners : కోళ్లపై వైరస్‌ పంజా

ABN , Publish Date - Feb 05 , 2025 | 03:59 AM

పౌల్ట్రీ పరిశ్రమను ఈ వైరస్‌ కోలుకోలేని దెబ్బతీస్తోంది. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పందెం కోళ్లపై ఆర్‌డి వైరస్‌ దాడి చేయగా.....

Poultry Farm Owners : కోళ్లపై వైరస్‌ పంజా

  • ‘పశ్చిమ’లో లక్షల్లో మృత్యువాత

  • పడిపోయిన కోడిగుడ్ల ఉత్పత్తి

  • ఆందోళనలో యజమానులు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్‌ దాడి చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమను ఈ వైరస్‌ కోలుకోలేని దెబ్బతీస్తోంది. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పందెం కోళ్లపై ఆర్‌డి వైరస్‌ దాడి చేయగా, అప్పట్లో పౌలీ్ట్రల యజమానులు అప్రమత్తమయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కోళ్లకు మరో వైరస్‌ సోకడంతో లక్షల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వైద్యుల సూచిస్తున్న మందులన్నీ వాడుతున్నా.. వ్యాధి అదుపులోకి రావడం లేదు.

కష్టకాలం..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఉంగుటూరు, కొల్లేరు ప్రాంతాల్లో పౌలీ్ట్ర ఫారాలు ఉండగా, వాటిలో కోటి 30 లక్షల వరకూ కోళ్లు ఉన్నాయి. వాటిలో సుమారు 20 లక్షల కోళ్లు వైర్‌సతో చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ రోజుకు కోటి ఐదు లక్షల గుడ్లు ఉత్పత్తికాగా.. ప్రస్తుతం 85 లక్షలకు పడిపోయినట్టు తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే పౌల్ట్రీ రంగం కుదేలవుతుందని, దీని నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు.


పౌల్ట్రీ ఫారాల్లోనే ఎక్కువ చనిపోతున్నాయి

వెటర్నరీ డైరెక్టర్‌ దామోదరనాయుడు

పెరటి కోళ్లలో కంటే పౌల్ర్టీ ఫారాల్లో కోళ్ల మరణాలే ఎక్కువగా ఉంటున్నాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదరనాయుడు తెలిపారు. ఏటా డిసెంబరు- ఫిబ్రవరి మధ్య కోళ్ల మరణాలు ఉండేవని, ఈ ఏడాది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ ఏడాది కొల్లేరు ప్రాంతానికి వలస పక్షులు ఎక్కువగా రావడం, పౌల్ర్టీ రైతులు జీవ భద్రతా చర్యలు పాటించకపోవడం, చనిపోయినవాటిని శాస్త్రీయంగా పూడ్చిపెట్టకపోవడం, అంటువ్యాధుల వ్యాప్తితో కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే కోడిగుడ్లు, మాంసం వల్ల ప్రాణ హాని, ఆరోగ్య సమస్యలు వచ్చిన సమాచారం లేదని చెప్పారు. ఎలాంటి అపోహలు లేకుండా ఉడికించిన కోడి గుడ్లు, మాంసం వినియోగించవచ్చని సూచించారు. పౌల్ర్టీల నిర్వహణపై యాజమానులకు అవగాహన కల్పిస్తున్నామని, చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణకు భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు.

పౌల్ట్రీ ఫారాల వద్ద లాక్‌డౌన్‌

పౌలీ్ట్ర పరిశ్రమపై వైరస్‌ పంజా విసురుతుండటంతో పౌల్ట్రీ ఫారాల వద్ద లాక్‌డౌన్‌ చర్యలు చేపట్టారు. ఇందుల్లో భాగంగా బయట వ్యక్తులు, వస్తువులను పౌలీ్ట్ర కాంపౌడ్‌లోకి వెళ్లనివ్వడంలేదు. ఫారం చుట్టుపక్కల 100 మీటర్ల వరకూ ఫార్మలిన్‌ మందును పిచికారి చేస్తున్నారు. ఫారం లోపల క్యూఫర్‌ ఆల్‌ మందు చల్లుతూ వైర్‌సను అదుపు చేసే చర్యలు చేపడుతున్నారు. అత్యవసరంగా ఫారంలోకి వెళ్లేల్సినవారిని ప్రత్యేక కెమికల్‌లో చేతులు శుభ్రం చేసుకుంటేగానీ రానీయడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 03:59 AM