Pawan Kalyan: అవిడి ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:55 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళా ఉపాధి శ్రామికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆయా గాయపడినవారికి ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పారు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళా ఉపాధి హామీ శ్రామికులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అవిడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది ఉపాధి శ్రామికులు గాయపడ్డారు. ఆ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పవన్... పంచాయతీరాజ్ కమిషనర్‌తో మాట్లాడారు. ‘గాయపడిన వారికి అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించే బాధ్యతలను ఒక అధికారికి అప్పగించండి. ఆర్థిక సహాయం అందించే చర్యలు చేపట్టండి’ అని ఆదేశించారు.
Also Read:
విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..
ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?
For More Andhra Pradesh News and Telugu News..