Visakhapatnam: లోన్‌యాప్ ద్వారా మోసాలు
ABN , Publish Date - Apr 28 , 2025 | 05:03 AM
ఇన్‌స్టెంట్ లోన్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్ చేయబడింది

తొమ్మిది మంది అరెస్టు రూ60 లక్షల క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్
విశాఖపట్నం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టెంట్ లోన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్, 18 మొబైల్ ఫోన్లు, 54 సిమ్‌కార్డులు, 15 స్టాంప్‌ప్యాడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. రూ.60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్ చేశారు. ఈ కేసు వివరాలను సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. నగరంలోని మహారాణిపేటకు చెందిన ఒకవ్యక్తి క్యాష్‌మాక్స్ అనే ఇన్‌స్టెంట్ లోన్‌యాప్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి బిహార్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, అసోం తదితర రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాలకు మృతుడి భార్య డిపాజిట్ చేసిన సొమ్ము జమైందని గుర్తించారు. నేరస్థుల్లో భరత్ సాంబ అనే వ్యక్తితోపాటు మరో 8మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తంగా సాంబ ఓపెన్ చేయించిన 132ఖాతాలను పరిశీలించగా వాటిపై 1,500 ఫిర్యాదులు అందాయని, మొత్తం రూ.200 కోట్ల లావాదేవీలు జరిగినట్టు తేలిందని చెప్పారు. అన్ని ఖాతాల్లో పడిన మొత్తం డబ్బు చైనీస్ కంపెనీలకు చేరుతున్నట్టు గుర్తించామని సీపీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
For AndhraPradesh News And Telugu News