Road Accident: స్థానికులపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లోనే
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:32 PM
నెల్లూరు జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
నెల్లూరు, నవంబర్ 11: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈరోజు (మంగళవారం) నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ స్థానికులపై దూసుకెళ్లింది. అలాగే టాటా ఏస్ వాహనం, మూడు బైకులు ఢీ కొట్టిన లారీ ఆపై చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా... ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాలు చాలా నెమ్మదిగా నడపాల్సి ఉంటుంది. అక్కడ కొన్ని ఇండికేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇవేమీ పాటించుకోకుండా చెన్నై నుంచి కలకత్తా వైపు వెళ్తున్న ఓ లారీ అతి వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి పైకి వెళ్లింది. ఎప్పుడూ చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో పాటు పలువురు గాయపడటం పలువురిని తీవ్రంగా కలిచివేసింది. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి...
త్వరలోనే ఏపీకి మరిన్ని పరిశ్రమలు: మంత్రి పయ్యావుల
మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం
Read Latest AP News And Telugu News